Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ప్రముఖ హీరోను ఇంట్లో నుండి గెంటేసిన కుటుంబ సభ్యులు
చెన్నై: సీతా కోక చిలుక, వీర భద్రుడు, అన్వేషణ, పుణ్యశ్రీ, అభినందన, గోపాల్ రావుగారి అబ్బాయి, మగరాయుడు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ తమిళ హీరో కార్తీక్ ఇపుడు కష్టాల్లో పడ్డారు. ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో కుటుంబ సభ్యులు అతన్ని ఇంట్లోనుండి గెంటేసినట్లు సమాచారం.
తమిళ నటుడు ముత్తురామన్ వారసుడైన కార్తీక్ చాలా కాలంగా తల్లి, తమ్ముడు, చెల్లితో కలిసి ఉంటున్నారు. వీరి కుటుంబానికి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అయితే కార్తీక్‌కు తల్లికి మధ్య చాలాకాలంగా ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా కలిసి కార్తీక్‌ను బయటకు గెంటేసినట్లు సమాచారం.
తండ్రి ఆస్తి తనకు పంచాలని కార్తీక్ కోరగా కుటుంబ తల్తితో పాటు సభ్యులు నిరాకరించినట్లు సమాచారం. దాంతో కార్తీక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే కార్తీక్ డబ్బును వృధా చేస్తుండటం వల్లనే అతనికి ఆస్తులు ఇవ్వడానికి తాము నిరాకరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు సమాచారం.