చిరంజీవితో అలా.. నా సినిమాలు పది రిలీజైనా ఈ కిక్ రాదు.. గాల్లో తేలిపోతోన్న యంగ్ హీరో

యంగ్ హీరో కార్తికేయకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఓ అవార్డు ఫంక్షన్‌లో చిరంజీవి పాటలన్నింటికి మెగాస్టార్‌లా స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే ఈవెంట్‌లో చిరు కాళ్లపై పడి ఎమోషనల్ అయ్యాడు. ఆనంద భాష్పాల్లో తడిపి ముద్దయ్యాడు. అంతటి అభిమాని కార్తికేయకు అపురూపమైన, అద్భుతమైన అవకాశం వచ్చింది. చిరంజీవితో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామయ్యాడు కార్తికేయ. దీంతో అతని ఆనందాన్నికి అవధుల్లేకుండా పోయాయ్.

 చిరు సందేశం..

చిరు సందేశం..

కరోనా వైరస్, దాని వ్యాప్తి, అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చిరంజీవి ఇప్పటికే ఎన్నో మార్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కరోనా ఉధృతి మరింతగా పెరుగుతుండగా.. తాజాగా మరో సారి రంగంలోకి దిగాడు. కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తన స్టైల్లో చెప్పాడు.

హీరో కార్తికేయతో..

హీరో కార్తికేయతో..

చిరంజీవి, కార్తీకేయ కలిసి రూపొందించిన వీడియోలో.. యంగ్ హీరో మాస్క్ ధరించకుండా మీసాలు దువ్వకుంటుంటే.. మీసం మెలేయటం వీరత్వామే కాని అది ఓకప్పుడు ఇప్పుడు .. మొహానికి మాస్కును ధరించడమే వీరుని లక్షణమని చిరంజీవి మాస్క్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించాడు. ఆ వెను వెంటనే మాస్క్‌ను హీరోకు విసిరాడు. ఇక ఆ మాస్క్‌ను అందుకున్న కార్తికేయ దాన్ని ధరించి వాటిపై ఉన్న మీసాలను దువ్వుకున్నాడు.

ఈషా రెబ్బాతోనూ..

ఈషా రెబ్బాతోనూ..

తెలుగు అందం ఈషా రెబ్బాతోనూ చిరంజీవి ఓ వీడియో చేశాడు. మొహానికి చిరునవ్వు అందం.. కానీ ఆ చిరునవ్వు కలకాలం ఉండాలంటే మొహానికి మాస్క్ తప్పని సరి చిరు ఉపదేశమిచ్చి.. ఈషారెబ్బాకు ఓ మాస్క్‌ను విసిరాడు. ఇలా ప్రస్తుత పరిస్థితిలో మాస్క్‌ తప్పనిసరి ధరించాలని చిరు చెప్పిన మెసెజ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఉబ్బితబ్బిబ్బైన హీరో..

ఉబ్బితబ్బిబ్బైన హీరో..

చిరుతో కలిసి ఈ మంచి పనిలో భాగస్వామ్యం అయినందుకు కార్తికేయ ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ మేరకు కార్తికేయ ట్వీట్ చేస్తూ.. ‘కరోనా భయం, షూటింగ్స్ మిస్ అవ్వడం, నెక్ట్స్ ఎలా ఉంటుందో అని భయం అన్ని తీరిపోయాయ్.. ఈ ఒక్క వీడియోతో మెగాస్టార్ గారితో నేను కలిసి ఒక మంచి పని కోసం వీడియో చేయడం, నా సినిమాలు పది రిలీజైనా ఈ కిక్కు రాదు.. చిరంజీవి సర్‌తో మరో జీవితానికి సరిపోయే మెమోరీ ఇది' అని ఎమోషనల్ అయ్యాడు.

 గొప్ప పనిలో భాగం..

గొప్ప పనిలో భాగం..

చిరంజీవితో కలిసి నటించడంపై ‘నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సర్.. ఓ గొప్ప పని కోసం సినీ పరిశ్రమను ఆదుకునేందుకు మన కోసం సీసీసీ ఏర్పాటు చేసి మమ్మల్ని అందర్నీ ప్రోత్సహించార'ని చెబుతూ మాస్క్ ధరించండి, సురక్షితంగా ఉండండని ఈషారెబ్బా కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X