Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమాల్లోకి ఎందుకు వెళ్లాడనే బాధ ఉండేది.. హీరో కార్తీకేయ తల్లి షాకింగ్ కామెంట్
జ్ఞాపిక ప్రొడక్షన్స్, స్రింట్ ఫిల్మ్స్ ద్వారా అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. సినిమా యూనిట్ చేపట్టిన వినూత్న ప్రచారం, టీజర్లు, ట్రైలర్లు, ఆడియో ప్రమోషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ద్వారా ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం కావడం సినిమాపై అంచనాలు పెరిగాయి. సామాజిక సందేశంతో ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్ మీడియాతో పంచుకొన్నారు. ఈ సందర్భంగా
మా అంచనాలు కరెక్ట్ అని
గుణ 369 సమర్పకురాలు ప్రవీణ్ కడియాల మాట్లాడుతూ.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు ఉన్న అంచనాలు కరెక్ట్ అని రుజువు అయ్యాయి. సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్సాన్స్ వస్తున్నది. తొలి ఆట నుంచే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయని డిస్టిబ్యూటర్ల నుంచి సమాచారం ఉంది. వేధింపులకు లోనయ్యే ప్రతీ మహిళకు, యువతికి ఈ సినిమా నచ్చుతుంది అని చిత్ర సమర్పకురాలు ప్రవీణ్ కడియాల అన్నారు.
గుణ 369 బాగా నచ్చింది
హీరో కార్తీకేయ తల్లి మాట్లాడుతూ.. మా అబ్బాయి మూడు సినిమాల్లో నటించినా.. మేమెప్పుడు సినిమా ఫంక్షన్లకు రాలేదు. గుణ 369 సినిమా మాకు బాగా నచ్చింది. కార్తీకేయ సినిమాల్లోకి ఎందుకు వెళ్లాడా అని బాధపడే వాళ్లం. గుణ 369 సినిమా చూసిన తర్వాత అలాంటి ఫీలింగ్ లేదు. కార్తీకేయ బాగా నటించాడు అని అన్నారు.
RX 100 హీరో అనే మాటను
హీరో కార్తీకేయ మాట్లాడుతూ.. గుణ 369 సినిమా చూసిన తర్వాత RX 100 హీరో అనే మాట మరిచిపోతారు. గుణ పాత్రను అందించిన దర్శకుడు అర్జున్ జంధ్యాలకు నా థ్యాంక్స్. నేను పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. మహిళలు, అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. నా కెరీర్లో నేను గర్వపడే సినిమా అని చెప్పుకొంటాను అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు
నైజాం డిస్టిబ్యూటర్ శ్రీను మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిపోర్ట్ ఉంది. థియేటర్లు కూడా పెంచాలనుకొంటున్నాం. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. మంచి సందేశంతో సినిమాను రూపొందించిన అర్జున్ జంధ్యాలకు థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించడం ఖాయం అని అన్నారు.