twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌‌కి అవసరమా? రోజా మాటలేంది? అంతా చిరు, ఎన్టీఆర్ వారసులే, నాని ఒక్కడే.... కోటా సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    పవన్‌‌కి అవసరమా ? ఇండస్ట్రీ లో నాని ఒక్కడే.... కోటా సంచలనం !

    సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, రోజా కామెంట్స్ గురించి మాట్లాడారు. ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం.

    ఇపుడు మీసం గడ్డం రానోళ్లందరూ హీరోలే

    ఇపుడు మీసం గడ్డం రానోళ్లందరూ హీరోలే

    ఇపుడు మీసం గడ్డం రానోళ్లందరూ హీరోలే. వాడికి ఏం తెలుసు? సినిమా ఇండస్ట్రీ గురించి? వయసు పాతికేళ్లకు మించి ఉండదు. అందులో మూడేళ్లు విశాఖపట్నం వెళ్లి వాడి దగ్గర ఎవడి దగ్గరో డైలాగులు నేర్చుకోవడం, ముంబై వెళ్లి డాన్సులు నేర్చుకోవడం, మిడిమిడి జ్ఞానంతో ఇండస్ట్రీకి రావడం ఇదే జరుగుతోంది.... అని కోట వ్యాఖ్యానించారు.

    ప్రతి వాడు చిరంజీవి మేనల్లుడు, రామారావుగారి మనవడు

    ప్రతి వాడు చిరంజీవి మేనల్లుడు, రామారావుగారి మనవడు

    "అంటే కోపం వస్తుంది కానీ ఇపుడు ఇండస్ట్రీలో పాతిక ముప్పై మంది దాకా హీరోలుగా ఉన్నారు. సొంత పేరు మీద వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతి వాడు చిరంజీవి మేనల్లుడు, చిరంజీవి బావమరిది కొడుకులు, రామారావుగారి మనవడు ఇట్లా తప్ప వారి పేరు మీద వచ్చేవారు తక్కువ. నాని అనే కుర్రవాడు ఒకడు తన సొంత పేరుతో ఎదిగాడు. ఇది వరకు అలా కాదే.... అని కోట వ్యాఖ్యానించారు.

    అదంతా ఎవడు చెప్పమన్నాడు

    అదంతా ఎవడు చెప్పమన్నాడు

    గతంలో సినిమాకు ఎంత ఖర్చయింది. ఏమిటి? ఏం తీశారు? అనేది ఎవడికీ తెలిసేది కాదు. రామారావు గారు ఎంత తీసుకున్నాడో ఎవడికి తెలుసు? తీసుకున్న ఆయనకు, ఇచ్చిన నిర్మాతకే తెలుసు. కానీ ఇపుడు నిర్మాతలే సినిమా ప్రారంభం రోజే ఇది భారీ బడ్జెట్ చిత్రం, సినిమా బడ్జెట్ 35 కోట్లండీ, ఇంకా భరించడానికి కూడా సిద్ధమే అని ప్రకటిస్తున్నాడు. ఇవన్నీ ఎవడు చెప్పమన్నాడు? మేమేమైనా అడిగామా? స్క్రీన్ మీద కనిపించాలి నువ్వు తీసిన సినిమా, అంతే కానీ ఇవన్నీ కాదు.... అని కోట వ్యాఖ్యానించారు.

    ఇదీ ఇప్పటి డైరెక్టర్ల తెలివి

    ఇదీ ఇప్పటి డైరెక్టర్ల తెలివి

    మొన్న ఒక డైరెక్టర్‌ను షూటింగులో సీన్ ఏంటని అడిగాను. కానీ వాడు నేను ఏం చేయాలో చెప్పకుండా..... ఇది ట్రాలీ షాటండీ, తర్వాత క్రేన్ షాట్ అంటూ చెప్పడం మొదలు పెట్టాడు. ఇదీ ఇపుడున్న డైరెక్టర్ల తెలివి అని కోట మండి పడ్డారు. ప్రతివాడు ఓ గడ్డం పెంచుకోవడం, సంకలో లాప్ టాప్ పెట్టుకోవడం... మాటల్లో పడి ఆ ల్యాప్ టాప్ దొబ్బామంటే నాలుగైదు రోజులు సినిమా ఆగిపోతుంది. అదీ ఇప్పుడు పరిస్థితి అని కోట తెలిపారు.

    బాహుబలి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు?

    బాహుబలి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు?

    ‘బాహుబలి' సినిమా విడుదలకు రెండు నెలల ముందు.. విడుదలైన తర్వాత రెండు నెలల పాటు ఆ సినిమా గురించి దేశంలో ఊదరగొట్టేశారు. ఇప్పుడెవరైనా ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారా? పాత 'మాయాబజార్' సినిమా గురించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్యూచర్లో కూడా మాట్లాడుకుంటారు.... అదీ సినిమా అంటే అని కోట వ్యాఖ్యానించారు.

    ‘బాహుబలి’ సినిమా తక్కువని తాను చెప్పట్లేదు

    ‘బాహుబలి’ సినిమా తక్కువని తాను చెప్పట్లేదు

    ‘బాహుబలి' సినిమా తక్కువని తాను చెప్పట్లేదని.. అద్భుతమైన సినిమా అని, ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుందనీ ఆయన ప్రశంసించారు. ‘బాహుబలి' సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారని, వాళ్లెవరికీ పేరు రాలేదని, దర్శకుడు రాజమౌళికి మాత్రమే పేరు వచ్చిందని..దీని అర్థం దర్శకుడు గొప్పవాడని, ఈ లెక్కన పాత దర్శకులు ఇంకెంత గొప్పవాళ్లో అని.... అని కోట వ్యాఖ్యానించారు.

    ఇప్పటివారిలో అది లేదు

    ఇప్పటివారిలో అది లేదు

    నాటి దర్శకులు, నిర్మాతలు సినిమాతో వ్యాపారం చేసినా సమాజం పట్ల బాధ్యతగా భావించేవారని, ఇప్పటివాళ్లలో అది కొరవడిందని కోట కుండ బద్దలు కొట్టారు.

    కేసీఆర్, చంద్రబాబు గురించి

    కేసీఆర్, చంద్రబాబు గురించి

    కేసీఆర్ అదృష్టం ఏమిటంటే.... ఆయన చేతిలో ఒలిచిన అరటిపండు పెట్టినట్లు రాష్ట్రాన్ని పెట్టారు. అంతా అభివృద్ధి చెంది ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన తేలికే. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ మాదిరిగా అమరావతి, బెజవాడ కావాలంటే 20 ఏళ్లు పడుతుంది. చంద్రబాబు గుడ్ అడ్మినిస్ట్రేటర్. ముందు చూపు ఎక్కువ. అధికారం ఆయన చేతుల్లో ఉండటమే మంచిది... అని కోట అభిప్రాయ పడ్డారు.

    రాజకీయాలు అవసరమా?

    రాజకీయాలు అవసరమా?

    రాజకీయాల్లోకి వస్తానన్న రజినీకాంత్ పెడితే పార్టీ పెట్టాలి. లేకుంటే లేదు. అంతే కానీ వస్తాను అంటూ స్టేట్మెంట్స్ ఎందుకు? ప్రజలు, అభిమానుల్లో కన్ ఫ్యూజన్ తప్ప. చిరంజీవి పార్టీ ఏమయ్యారో పవన్ కళ్యాణ్‌కు తెలుసు, అయినా సరే ఆయన వస్తున్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. కాకపోతే ఇక్కడ ఉండే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి... అని కోట వ్యాఖ్యానించారు.

    అందుకే ఎన్నికలకు దూరం

    అందుకే ఎన్నికలకు దూరం

    వాయిపేయి అంటే ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన కోట శ్రీనిసరావు గతంలో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం విధితమే. అయితే రాను.. రాను ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోవడంతో ఎన్నికలకు తాను దూరంగా ఉన్నానని, కాకపోతే పార్టీలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

    అలాంటి వాళ్లు మనకు అవసరమా?

    అలాంటి వాళ్లు మనకు అవసరమా?

    నేనెప్పుడూ ఇతర భాషా నటులను ఏమీ అనలేదు. పరబాషా వాళ్లను తీసుకురావద్దు, కావాలంటే పరబాషా నటులను తెచ్చుకోండి. మీకు దమ్ముంటే నానా పాటేకర్, నసీరుద్దీన్ షాను తెచ్చుకోండి. అమితాబ్ బచ్చన్ తో చేయించండి. ఆయన వద్ద నౌకర్ వేషం వేయాలన్నా నేను ఫీలవ్వను. జక్రా బుక్రాగాళ్లను తీసుకొచ్చి. వాడికి లక్షలు లక్షలు ఇచ్చి హోటళ్లలో పెట్టి చేయొద్దంటున్నా. అక్కడ వాళ్లని ఎవరూ గుర్తు పట్టరు. కౌన్ హౌై ఓ అంటారు. విషయం ఉన్నవాడిని తీసుకొస్తే తప్పులేదు.... అని కోట అన్నారు.

    ఆరడుగుల విలన్... ఐదడుగుల హీరోనా?

    ఆరడుగుల విలన్... ఐదడుగుల హీరోనా?

    ముఖేష్ రిషి అనే విలన్ ఉంటాడు. ఆరుడుగులపైనే ఉంటాడు. బన్నీ ఇంకా ఇతర హీరోల సినిమాల్లో చేస్తుంటాడు. వీళ్లేమో ఐదడుగులు ఉంటారు. వీడు వాళ్లను తంతే ఎగిరిపోయి ఫ్యాక్టరీ చిమ్నీల్లో పడిపోయి చిమ్నీ ఊడిపోయేంత ఫైటింగ్ ఉంటుంది. ఇదీ ఇప్పటి పరిస్థితి అని కోట అన్నారు.

    ఎన్టీఆర్ మీద మచ్చ

    ఎన్టీఆర్ మీద మచ్చ

    ఎన్టీఆర్‌గారు కారణ జన్ములు. చిన్న చిన్న తప్పులు జరిగినా కొట్టుకు పోయాయి. ఆయన మహానుభావుడు. లక్ష్మీ పార్వతి అంశం ఆయన జీవితంలో ఓ మచ్చ. అంత జరిగినా కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్లకి ఓ చరిత్ర ఉంది.... అని కోట అన్నారు. తనది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్థాయి కాదన్నారు.

    జబర్దస్త్ బూతుల గురించి

    జబర్దస్త్ బూతుల గురించి

    జబర్దస్త్ మీద నేనే కాదు చాలా మంది విమర్శలు చేశారు. నేను కూడా... హాస్యం హాస్యంలాగా ఉండాలి అన్నాను. ఆ ఫ్రోగ్రాంలో మగ పిల్లలు అందరూ ఆడవేషాలు వేస్తారు. చీరలు పైకెత్తి, లుంగీ లాగి వాడిని తన్ని, వీడిని తన్ని టపా టపా కొట్టుకు చావడం తప్ప ఏముంది. పోనీ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. ఆడి పెళ్లాన్ని వీడు తీసుకోవడం, డబల్ మీనింగ్ డైలాగులు తప్ప ఏమీ లేదు. సరదాగా హాస్యంగా ఉండేటివి లేవు. పిల్లలు చెడిపోయే పరిస్థితి ఉంది.... అని కోట అన్నారు.

    రోజా ఆ మాటలేమిటి?

    రోజా ఆ మాటలేమిటి?

    రోజాను నేను పెద్ద పొలిటికల్ లీడర్ గా కన్సిడర్ చేయను. పట్టించుకోను. ఎందుకంటే ఆవిడ అనుభవం కానీ, ఆవిడ మాట్లాడే పద్దతికానీ నచ్చదు. బండ్ల గణేష్, ఆవిడ మాట్లాడే క్లిప్పింగ్ ఇటీవల చూశాను. ఏమిటా మాటలు. వాడంటే ఏదో కుర్ర వెధవ పిచ్చోడిలా వాగాడనుకోండి... నీకేమిటి? ఎమ్మెల్యేగా గెలిచావు. ఏమిటా మాటలు. నువ్వెప్పుడైనా వెళ్లి పక్కలేశావా అంటూ ఆ మాటలేమిటి? ఎందుకు ఇవన్నీ.... అంటూ కోట శ్రీనిసరావు తప్పుబట్టారు.

    English summary
    Tollywood senior Actor Kota Srinivasa Rao Fires on Tollywood Stars Legacy & Jabardasth Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X