అలా మాట్లాడే సరికి నంబర్ బ్లాక్ చేశా.. యువతి రేప్ ఆరోపణలపై స్పందించిన కృష్ణుడు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ యువతి వీడియోలు, ఆడియోలు కనిపిస్తున్నాయి. తనపై 139 మంది గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని ఓ యువతి చేసిన ఆరోపణలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇందులో సినీ సెలెబ్రిటీల నుంచి యాంకర్ ప్రదీప్, నటుడు కృష్షుడు పేర్లు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ యాంకర్ ప్రదీప్ ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణుడు సైతం మీడియాతో మాట్లాడాడు.

స్పందించిన ప్రదీప్..
సదరు యువతి చేసిన ఆరోపణల్లో తన పేరు బయటకు రావడం, నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా తనపేరు వాడటంపై యాంకర్ ప్రదీప్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ ఆరోపణలు నిర్దారణ చేస్తూ వార్తలు రాయడంపై లీగల్ యాక్షన్ తీసుకోబోతోన్నాని హెచ్చరించాడు. సదరు యువతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని ఖండించాడు.

ఎలాంటి సంబంధం లేదు..
యువతి చేసిన ఆరోపణలపై కృష్ణుడు మీడియాతో మాట్లాడాడు. ఆమె ఎవరో కూడా నాకు తెలీదు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలే. ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే సహకరిస్తాను. వారితో కూడా చెబుతాను. ఆమె చెప్పినట్టుగా ఏమీ జరగలేదు. అని కృష్ణుడు చెప్పుకొచ్చాడు.

నంబర్ బ్లాక్ చేశాను..
ఓ సారి నల్గొండ నుంచి నా ఫ్యాన్ అంటూ ఓ అమ్మాయి ఫోన్ చేసింది. మా ఊరికి రావొచ్చు కదా అంటూ వెరైటీగా మాట్లాడే సరికి అనుమానం వచ్చి నంబర్ బ్లాక్ చేశాను. నా ఫ్యాన్స్ అంటూ ఎవరైనా వచ్చి మాట్లాడటమో, ఆటోగ్రాఫ్ ఇవ్వడమో తప్పా నాకు ఎలాంటి అమ్మాయితో పరిచయం లేదు అని కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు.

నా గురించి అందరికీ తెలుసు..
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఎంతో మంది హీరోయిన్లతో పని చేశాను. నా గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఒక్క రిమార్క్ కూడా లేదు. నేను పూర్తిగా ఫ్యామిలీ మెన్‌ని ఎలాంటి వివాదాలు నా మీద రాలేదు. కానీ ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాను అని కృష్ణుడు తెలిపాడు.
Recommended Video

ప్రదీప్‌కు మద్దతుగా..
సదరు యువతి చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. ప్రదీప్ రిలీజ్ చేసిన వీడియో బాగానే వైరల్ అయింది. ఈ మేరకు యాంకర్ రవి ప్రదీప్‌కు మద్దతు తెలిపాడు. ప్రదీప్ చెప్పినట్టుగా.. సోషల్ ట్రోలింగ్ చేయకండి అని కోరాడు. నిజం బయటకు వచ్చే వరకు ఎదురుచూడండి.. నేను ప్రదీప్‌కు అండగా నిలబడతాను అంటూ పిడికిలి బిగించిన ఫోటోను షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











