కృతిక చౌదరీది ఆత్మహత్య కాదు.. హత్యే!.. దారుణమైన విషయాలు వెలుగులోకి..
వర్థమాన సినీ, టెలివిజన్ తార కృతికా చౌదరీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృతిక మృతిని అనుమానాస్పదమైన మృతిగా నమోదు చేసుకొన్న ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
వర్థమాన సినీ, టెలివిజన్ తార కృతికా చౌదరీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృతిక మృతిని అనుమానాస్పదమైన మృతిగా నమోదు చేసుకొన్న ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆమెది ఆత్మహత్య కాదని, హత్యకు గురై ఉంటుందనే సందేహాలను వ్యక్తం చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. కృతిక మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు పంపించారు. శవ పరీక్ష ఆధారంగా వచ్చే నివేదికలో కృతిక మరణం వెనుక ఉన్న కారణాలు బయటపడవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముంబై అంధేరి పోలీసుల మీడియాతో మాట్లాడుతూ..

పొరుగువారి సమాచారంతో..
కృతిక పశ్చిమ అంధేరిలోని చార్ బంగ్లా ఏరియాలోని భైరవ్‌నాత్ సొసైటీలో కృతికా నివాసం ఉంటున్నారు. ఆమె గది నుంచి కుళ్లిన వాసన వస్తుందని ఇరుగు పొరుగువారు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొన్నాం. గది తలుపులు తెరిచి చూడగా ఇంట్లో కుళ్లిన మృతదేహం కనిపించింది. గత మూడు, నాలుగు రోజుల నుంచి గదికి తాళం వేసి ఉందని వారు చెప్పారు అని అంబోలి పోలీసుల పేర్కొన్నారు.

ఏడీఆర్‌గా కేసు నమోదు..
కృతిక మృతిని యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్)గా నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాం. ప్రాథమిక విచారణ అనంతరం కృతిక హత్యకు గురైనట్టు భావిస్తున్నాం. పోస్ట్ మార్టమ్ నివేదిక అనంతరం కేసుపై స్పష్టత వస్తుంది అని పోలీసులు పేర్కొన్నారు. శారీరంపై గాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వాటి ఆధారంగా ఆమెది ఆత్మహత్య కాదని భావిస్తున్నామని తెలిపారు.

నాలుగు రోజుల క్రితమే హత్య..
ఇంట్లో ఏసీలు ఆన్ చేసి ఉన్నందున గది నుంచి కుళ్లిన వాసన రాలేదు. ఈ హత్య మూడు, నాలుగు రోజుల క్రితమే జరిగింది. ఏసీలు ఆన్ చేసి ఉండటం వల్ల ఆమె మృతి చెందిన విషయం బయటకు రాలేదు అని ముంబై పోలీసు అధికార ప్రతినిధి రష్మీ కరందికర్ తెలిపారు. నాలుగైదు రోజులు కావడంతో మృతదేహం దారుణంగా కుళ్లిపోయింది అని పేర్కొన్నారు.

అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో..
2013లో బాలీవుడ్ నటి కంగన రనౌత్ నటించిన రజ్జో చిత్రంలో నటించింది. బాలాజీ టెలివిజన్ రూపొందించిన సీరియల్ పరిచయ్‌లో కూడా ఆమె నటించారు. గత కొద్దిరోజులుగా అవకాశాలు లేకపోవడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనే విషయం ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆమె మరణం వెనుక అఫైర్, అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.


Click it and Unblock the Notifications











