twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు: కుష్బూ

    |

    Recommended Video

    వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు..!

    జీవితాన్ని కింది స్థాయి నుంచి మొదలుపెట్టి మంచి స్థాయికి చేరుకున్న ప్రతీ ఒక్కరి వెనకాల వ్యథాభరిత నేపథ్యమేదో ఉండి ఉంటుంది. వాళ్ల సక్సెస్‌ను పదిమంది పొగుడుతున్నప్పుడు.. ఆ నేపథ్యాన్ని తలుచుకుంటే వాళ్ల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో తన జీవితంలోని కొన్ని వ్యథాభరిత క్షణాలను నటి కుష్బూ గుర్తుచేసుకున్నారు..

     మా నాన్న విచక్షణ లేని వ్యక్తి:

    మా నాన్న విచక్షణ లేని వ్యక్తి:

    సినిమాల్లోనే కాదు.. బయట కూడా నేను రెబల్. చిన్న వయసులోనే రెబెల్‌ తరహాలో తిరగబడ్డాను. అది కూడా మా నాన్న పైనే. మా నాన్నతో ఉండలేక.. మా అమ్మను, సోదరుడ్ని తీసుకుని బయటకొచ్చేశా. మా నాన్న మహిళలను కించపరుస్తూ మాట్లాడటం నాకు నచ్చలేదు. భార్యను అసభ్యంగా దూషించే భర్త ఆయన.

     మగాడి ప్రపంచంలో మహిళంటే..:

    మగాడి ప్రపంచంలో మహిళంటే..:

    మా అమ్మను తిట్టడం మగాడి ప్రపంచంలో భార్య ఇలాగే ఉండాలన్న గర్వం నాకు నచ్చలేదు. ఇంటి నుంచి బయటకొచ్చేటప్పటికీ నాకు 16ఏళ్లు. గతి లేక మీరే ఏదో రోజు నాదగ్గరికి వస్తారని మా నాన్న అన్నారు.

    చావనైనా చస్తా కానీ..:

    చావనైనా చస్తా కానీ..:

    నేను ఆయనకు చెప్పా. ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. అది అది 1986 సెప్టెంబరు 12. నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకురా అని ఆ రోజు మా నాన్న నాతో అన్నాడు. అమ్మను, సోదరుడిని చంపేసి..నేను రైలు కిందపడి చస్తా కానీ ఆ పని చేయను చెప్పాను.

     శపథం చేసి మరీ వచ్చా..;

    శపథం చేసి మరీ వచ్చా..;

    ఏదో రోజు నువ్వు నన్ను చూసి చింతిస్తావని కూడా చెప్పాను. ఇక ఎప్పటికీ నీ దగ్గరికి రానని చెప్పేశాను. ఇండియా అంతా నా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. కుష్బూ ఒక మహిళగా పేరు తెచ్చుకుంది అని చెబుతున్నప్పుడు.. కచ్చితంగా నువ్వు చూసి తీరుతావని ఆనాడే శపథం చేశాను. ఆ స్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా ఉన్నా.

     మళ్లీ నాన్న ముఖం చూడలేదు

    మళ్లీ నాన్న ముఖం చూడలేదు

    ఆ శపథం చేసి 31ఏళ్లయినా ఇప్పటికీ నాన్న ముఖం చూడలేదు. చూడాలని కూడా అనుకోవట్లేదు. కాగా, సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న కుష్బూ ఇటీవలే అజ్ఞాతవాసితో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. కుష్బూ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

    English summary
    Actress Kushboo participated in India today conclave 2018 which is held in Hyderabad. Kushboo said she left her house with Mother and Brother at the age of sixteen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X