లావణ్య త్రిపాఠికి షాకిచ్చిన నిర్మాత.. రూ.3 కోట్ల జరిమానా!

టాలీవుడ్ అందాల తార లావణ్య త్రిపాఠికి ఎదురు దెబ్బ తగిలింది. ఓ సినిమా కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆమెకు తమిళ సినీ నిర్మాతల సంఘం భారీ జరిమానా విధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100%

By Rajababu

టాలీవుడ్ అందాల తార లావణ్య త్రిపాఠికి ఎదురు దెబ్బ తగిలింది. ఓ సినిమా కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆమెకు తమిళ సినీ నిర్మాతల సంఘం భారీ జరిమానా విధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ తమిళ రీమేక్ చిత్ర వ్యవహారం వివాదంగా మారింది. దీనిపై లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. వివరాల్లోకి వెళితే..

Recommended Video

The Film Makers Have Edited Out The Lavanya Tripati's Bikini Scene
తమిళంలో 100% కాదల్

తమిళంలో 100% కాదల్

తెలుగులో ఘనవిజయం సాధించిన సుకుమార్ చిత్రం 100% లవ్ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా నటించిన పాత్రను లావణ్య త్రిపాఠి పోషించేందుకు ఒప్పుకొన్నారు.

తప్పుకొన్న లావణ్య త్రిపాఠి

తప్పుకొన్న లావణ్య త్రిపాఠి

100% కాదల్ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంలో ఏదో కారణంతో ఈ సినిమా నుంచి తప్పుకొన్నది. దాంతో ఆ చిత్ర షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందట. దాంతో నిర్మాతలకు దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం.

లావణ్య స్థానంలో శాలిని పాండే

లావణ్య స్థానంలో శాలిని పాండే

ప్రస్తుతం 100% కాదల్ చిత్రంలో లావణ్య త్రిపాఠి స్థానంలో అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండేను తీసుకొన్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ నటించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి నిర్మాతగా సుకుమార్, భువన చంద్రమౌళి వ్యవహరిస్తున్నారు.

3 కోట్ల జరిమానా

3 కోట్ల జరిమానా

లావణ్య కాంట్రాక్టు ఉల్లంఘించడం వల్ల వచ్చిన నష్టాన్ని చెల్లించాలని సదరు నిర్మాత తమిళ నిర్మాతల సంఘాన్ని ఆశ్రయించారట. లావణ్య త్రిపాఠిపై నిర్మాత చేసిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత లావణ్య త్రిపాఠికి 3 కోట్ల జరిమానా విధించినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై లావణ్య నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

సాయి ధరమ్ తేజ్‌తో

సాయి ధరమ్ తేజ్‌తో

కాగా, లావణ్య త్రిపాఠి నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకొన్నది. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ సరసన లావణ్య నటించింది. సాయి ధరమ్ తేజ్‌తో లావణ్య ఓ చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X