హీరోయిన్ లక్ష్మీరాయ్ ఇక అమ్మమ్మ!
శృంగార తారగా దక్షిణాది చిత్రసీమలో తనదైన మార్కును వేసుకొన్న లక్ష్మీరాయ్ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఇంకా పెళ్లి కాకుండానే తాను అమ్మమ్మ అయ్యానని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ అమ్మమ్మ మారిన విధం ఇదే.
లక్ష్మీరాయ్ చాలా రోజులుగా పెంపుడు కుక్కలను పెంచుకొంటున్నది. ఇటీవల తన పెంపుడు కుక్క కవల పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో నేను అమ్మమ్మను అయ్యాను అని చెప్పింది.

నా వయసులో ఉండే మహిళలందరూ ఇప్పటికే తల్లులయ్యారు. కవల పిల్లలకు నేను మాత్రం అమ్మమ్మను అయ్యాను. నా కూతురుగా భావించే పెంపుడు కుక్క కవల పిల్లలకు జన్మనిచ్చింది. వాటికి టిఫనీ, పాకో అని పేర్లు పెట్టాను. వాటితో నా కుటుంబం క్రమంగా అభివృద్ది చెందుతున్నది.


Click it and Unblock the Notifications











