అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో విలన్ రోల్.. క్లారిటీ ఇచ్చిన మాధవన్
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాలో విలన్ పాత్ర కోసం గత కొంత కాలంగా దర్శకుడు సుకుమార్ చాలా మంది అగ్ర నటులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎవరు కూడా ఒప్పుకోవడం లేదనే టాక్ కూడా వైరల్ గా మారింది.
మొదట కోలీవుడ్ టాలెంటేడ్ యాక్టర్ విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ తరువాత తమిళ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా మాధవన్ ని ఫిక్స్ చేసుకున్నట్లు ఇటీవల మరొక రూమర్ వైరల్ అయ్యింది. బాలీవుడ్ మీడియాలో కూడా రూమర్స్ డోస్ పెరగడంతో మాధవన్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. అందులో ఏ మాత్రం నిజం లేదని సోషల్ మీడియాలోనే రూమర్స్ కి చెక్ పెట్టాడు.

దీంతో పుష్ప విలన్ పై మళ్ళీ బిగ్ సస్పెన్స్ నెలకొంది. ఇక మాధవన్ చాలా రోజుల తరువాత నిశ్శబ్దం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన ఆ సినిమాలో హీరోయిన్ అంజలి ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించింది. ఇక మాధవన్ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమని ఇప్పటికే ట్రైలర్ తో ఒక క్లారిటీ ఇచ్చేశారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











