పవన్‌కు నాలుగో భార్యనా? ఏంది మీ గోల? శ్రీరెడ్డిపై మాధవీలత సెటైర్లు

By Rajababu

Recommended Video

Madhavi Latha Responds on Fans Tweets

టాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకొన్న వివాదాలపై నటి మాధవీలత ఘాటుగానే స్పందిస్తున్నారు. శ్రీరెడ్డి, మహేష్ కత్తి లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తున్నారు. అంతేకాకుండా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఎవరైనా నోరెత్తితే సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇంతకీ మాధవీలత ఏమన్నారంటే..

పవన్ కల్యాణ్‌ను లవ్ చేశాను

పవన్ కల్యాణ్‌ను లవ్ చేశాను

ఎప్పుడో పదో తరగతిలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్‌ను లవ్ చేశా. ఆ రోజు పార్టీ లేదు. రాజకీయం తెలీదు. ఇవాళ ఎవరో వ్చి ఏదో చేస్తారని నా ప్రేమ పోదు. ఐ లవ్ పవన్ కల్యాణ్ ఫరెవర్. అది ఆయనకు చెప్పే అవసరం కూడా నాకు లేదు. నా ప్రేమ నా ఇష్టం. పార్టీకి నాకు సంబంధం లేదు అని మాధవీలత ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశారు.

పవన్‌కు నాలుగో భార్యనా?

పవన్‌కు నాలుగో భార్యనా?

నేను పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్యనా? అని ఎంది సామీ మీ గోల?. ఆయన్ని నాకంటే ఎక్కువ మంది లవ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి మాట అని పవన్ కల్యాణ్‌ను అవమానించవద్దు. ఇదే పనా ఆయనకు. నాకు నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం. ఆయన అంటే నాకు ప్రేమ అన్నంత మాత్రాన మీరు అనుకొనే కంపు కాదు. ఎలాంటి స్వార్ధం లేని ప్రేమ నాది.

నా జీవితంలోకి మరోకరు..

నా జీవితంలోకి మరోకరు..


అలా అని నా జీవితంలోకి ఇంకొకరు రారు.. లేరు అని కాదు. ఆయన అంటే నాకు ఇష్టం.. ప్రేమ మాత్రమే. నా ప్రేమ మీకు అర్ధం అయితే చాలూ.. కాకుండా ఏడవండి. ఇది నా స్పష్టమైన సమాధానం. నాకు షాపింగ్ చేయడం, హైదరాబాద్ ఎంత ఇష్టమో.. అలానే పీకే అన్నా అంతే ఇష్టం. ఈ మూడు విషయాలు మారవు. కాశీలో వదిలేయమన్నా వదిలేయను అంటూ మాధవీలత ఫేస్‌బుక్‌లో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.

శ్రీరెడ్డిపై సెటైర్లు

శ్రీరెడ్డిపై సెటైర్లు

అలాగే వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై పరోక్షంగా మాధవీలత సెటైర్లు వేశారు. కొందరు నీ ముఖానికి పాలిటిక్స్ ఎందుకు? నీకు అంత సీన్ లేదు. ఎవరైనా ఒక బకరాను పెళ్లి చేసుకో. పవన్‌ను అడ్డం పెట్టుకొని పైకి రావాలని ప్లాన్ ఉందా?. పవన్‌కు భజన చేస్తే పార్టీలోకి పిలువరు అని మాధవీలత సెటైర్లు విసిరింది. అందేకాకుండా నాకు టీవీ చూసే అలవాటు లేదు. ఫేస్‌బుక్ చూస్తే ఇలాంటి కామెంట్లు నవ్వుకోవడానికి చాలా చాలా బాగుంటున్నాయి అని మరో ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశారు.

 ఆ సినిమాలో హీరోయినా?

ఆ సినిమాలో హీరోయినా?

ఏ ఫిలిం బై అరవింద్2 చిత్రంలో హీరోయినా? మరి నా రోల్ ఏంటీ? ఈ గొడవ తెలిసి దర్శకులు శేఖర్ సూరి భయపడి గతనెల ముంబై పారిపోయారు. నిర్మాత విజయ్ కి మాటలు లేక మాయం అయ్యారు. హీరో శ్రీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. య్యూట్యూబ్‌లో ఉన్న అరవింద్2 చూస్తే హీరోయిన్ ఎవరో తెలుస్తుంది అని శ్రీరెడ్డిపై మాధవీలత విసుర్లు విసిరారు.

వారికి ముడుపులు ముట్టాయి

వారికి ముడుపులు ముట్టాయి

వివాదం సృష్టించిన వారిలో ఎవరికి కావాల్సిన ముడుపులు వాళ్లకి ముట్టాయి. ఎలాంటి కారణాల వల్ల వచ్చారో.. ఆ కారణాలకి సంబంధించి వాళ్ల వాళ్ల సరుకులు తెచ్చుకొన్నారు. సమయం తీరిపోయింది. సంచి సర్దుకొన్నారు. ఇంకో 10 సంవత్సరాల వరకు దిగులు లేదు. ఇప్పుడు డ్రామా మారిపోయింది. కొంతపుంతలు పుడుతున్నాయి. టైమ్ పాస్ గేమ్ ఆడుతున్నారు. నన్ను పిచ్చి దాన్ని చేయాలని చాలా ట్రై చేశారు. ఎవరైనా నా జోలికి రానంత వరకు సేఫ్. నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే ట్రిగ్గర్ వాళ్ల మీదే పేలుతుంది.

క్యాష్ కమిటీలో జయసుధ ఉంటే

క్యాష్ కమిటీలో జయసుధ ఉంటే

సినీ పరిశ్రమలో క్యాష్ కమిటీలో జయసుధ గారు ఉంటే 100 శాతం నా ఓటు ఉంటుంది. హ్యాపీగా ఫీలయ్యేదానిని. సమంత మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఇలా ఉంటే కమిటీ ఏం న్యాయం చేస్తుందో ఏమో. బయట వాళ్లు, లాయర్లు ఉంటే ఎలా స్పందిస్తారో అనేది వేచి చూయడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X