twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం.. ఏమైందంటే?

    |

    సినీ పరిశ్రమలో వరుస విషాదాల వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూసిన వార్త మరువక ముందే హిందీ సహా అనేక భాషలలో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన బప్పి లహరి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ నటుడు ఎవరు? అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

    మహర్షి రాఘవ గా మారి

    మహర్షి రాఘవ గా మారి

    తెనాలికి చెందిన గోగినేని రాఘవ తెలుగు సినిమాల మీద ఆసక్తితో, ఎలా అయినా సినిమాలో నటించాలని ప్రయత్నాలు చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో హీరోగా అవకాశం రావడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయన ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో గోగినేని రాఘవ కాస్త మహర్షి రాఘవ గా మారిపోయారు.

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా

    తన మొదటి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన ఆ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పాటించ లేక పోవడంతో హీరోగా మాత్రం కొనసాగలేక పోయారు. హీరో గా కొనసాగ లేకపోయినా ఆయన అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే కొనసాగారు. చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ సూర్యవంశం శుభాకాంక్షలు లాంటి అనేక సినిమాల్లో ఆయన నటించారు.

     సీరియల్స్ లో కూడా

    సీరియల్స్ లో కూడా

    ఎక్కువగా సినిమాలో హీరో, హీరోయిన్ల అక్క, బావ పాత్రలకు రాఘవ మొదటి ప్రిఫరెన్స్ గా ఉండేవారు. ఆ తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టిన ఆయన సీరియల్స్ లో కూడా బిజీ అయ్యారు. తెలుగులో వచ్చిన అన్వేషిత లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా మహర్షి రాఘవ భాగమయ్యారు. అయితే సీరియల్స్ లో ప్రవేశించిన తర్వాత ఆయన ఎక్కువగా సీరియల్స్ కే పరిమితం కావడంతో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

    Recommended Video

    Tollywood కి తెలంగాణాలో లేని సమస్యలు ఏపీ లో ఎందుకంటే - Comedian Ali Presmeet | Filmibeat Telugu
    రాఘవ ఇంట విషాదం

    రాఘవ ఇంట విషాదం

    తాజాగా నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు కాగా ఆమెకు ఇద్దరు కుమారులు. ఆమె పెద్ద కుమారుడు రాఘవ సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ మృతి విషయం తెలుసుకుని పలువురు సినీ, టీవీ రంగ ప్రముఖులు రాఘవకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

    English summary
    Actor Maharshi raghava mother kamalamma passed away due to health issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X