Mahesh Babu: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్ బాబు.. సీఎం సహాయనిధికి భారీ విరాళం...!
Mahesh Babu: తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ భారీ ఎత్తున నష్టం చేకూరింది. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో సహాయం అందించేందుకు పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. వరదల సమయంలో తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి చెరొక 50 లక్షల చొప్పున సహాయం చేస్తానని అందిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను మహేశ్ బాబు నిలబెట్టుకున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం.. నేడు ( సోమవారం) మహేష్ బాబు తన సతీమణి నమ్రత శిరోద్కర్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసం చేరుకున్నారు. ఈ ప్రత్యేక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి రూ.50 లక్షలతో పాటు, ఆయన నిర్వహిస్తున్న AMB సినిమాస్ తరపున కూడా మరో రూ.10 లక్షల విరాళం సంబంధించిన చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ బాబు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "ఇలాంటి సమయంలో సినీ నటులు కూడా తమ వంతు సహాయాన్ని అందించడంలో ముందుండటం గర్వకారమని.. మహేష్ బాబు దంపతులను అభినందించారు.' సీఎం రేవంత్ రెడ్డి.

అయితే.. సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ గానీ, ఆయన విరాళం ఎంత ఇచ్చాడనే విషయం కానీ వైరల్ అవ్వడం కావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి విరాళం అందజేసిన సమయంలో మహేశ్,నమ్రతతో కలసి ఫోటోలు దిగగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో మహేష్ లాంగ్ హెయిర్,గడ్డంతో కనిపిస్తున్నారు. మహేష్ బాబు లుక్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. అచ్చు హాలీవుడ్ హీరో కీన్ రీవ్స్ (Keanu Reeves)లా ఉన్నాడంటూ..కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మహేష్ బాబు హాలీవుడ్ కట్ అవుట్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగడమే కాదు, సేవా గుణంలోనూ రారాజు MB ఫౌండేషన్ (MB Foundation) పేరిట ఓ ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఈ పౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు (heart operations for children), పేద పిల్లలకు విద్యకు సహాయం చేయడానికి సినిమా ప్రదర్శనల ద్వారా సేకరించిన సొమ్మును విరాళంగా ఇస్తున్నారు. పేద ప్రజలకు వైద్యసాయం చేస్తున్నారు. ఆయన దాతృత్వంతో ఎంతో మంది చిన్నారులు గుండె జబ్బులను నయం చేసుకున్నారు. ఇటీవల మహేష్ ఫౌండేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది.
ఇదిలా ఉంటే.. దర్శక ధీరుడు బహుబలి రాజమౌళితో మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 18 శతాబ్దంలో జరిగే కథ అని, పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందనీ, ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. మరోవైపు ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications











