»   » మనోజ్ పుట్టినరోజు : హడావుడి తగ్గింది, రైతుల కోసమేనా?

మనోజ్ పుట్టినరోజు : హడావుడి తగ్గింది, రైతుల కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు నేడు. మరో విశేషం ఏమిటంటే మనోజ్ పెళ్లి రోజు కూడా నేడే. ఈ రోజుతో మనోజ్ వయసు పరంగా 34వ వసంతంలోకి అడుగుపెడుతుండగా, దాంపత్య జీవితంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అసలు ఎలాంటి సందడి కనిపించలేదు. సింపుల్ గా కొందరు అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య బర్త్ డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడాడారు.

హడావుడి వద్దని చెప్పిన మనోజ్

హడావుడి వద్దని చెప్పిన మనోజ్

నా ప్రతి బర్త్ డే అభిమానుల మధ్య ఎంతో గొప్పగా జరిగేది. ఈ సారి అందరూ వద్దు, ఫ్లవర్స్, బొకేలు, ఫ్లెక్సీలు వద్దని చెప్పాను. వాటికి ఖర్చు పెట్టే బదులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయమని అభిమానులకు చెప్పినట్లు మనోజ్ తెలిపారు.

రైతుల గురించి లైవ్ లో మాట్లాడతాను

రైతుల గురించి లైవ్ లో మాట్లాడతాను

ఈ రోజు ఈ వినింగ్ ఫేస్ బుక్ లైవ్ లో వస్తున్నా, ఓ వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఎన్నో చేస్తున్నాం... అదంతా ఈవినింగ్ మాట్లాడతాను. ముఖ్యంగా రైతుల సమస్య ఇన్నాళ్లు నా మనసును కదిలిస్తోంది. మేము కూడా రైతు ఫ్యామిలీ నుండి వచ్చాం, మా తాత రైతు. ఈ రోజు ఆ విషయం మీద మాట్లాడుదామనుకుంటున్నాను. నేను తీసుకున్న నిర్ణయానికి నన్ను నమ్ముకున్న అభిమానుల దగ్గర నుండి వెల్ విషర్స్ వరకు అంతా సపోర్టు చేస్తారని అనుకుంటున్నాను అని తెలిపారు.

ఆశ్చర్య పరిచిన మనోజ్

ఆశ్చర్య పరిచిన మనోజ్

సాధారణంగా సినీ స్టార్ల బర్త్ డే వేడుకల్లో రైతుల ప్రస్తావన అసలు ఉండదు, సినిమాలు... అభిమానులు ఇలాంటి విషయాలే ఉంటాయి. అయితే మనోజ్ కొత్తగా రైతుల ప్రస్తావన తేవడంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఏం మాట్లడబోతున్నాడు?

ఏం మాట్లడబోతున్నాడు?

మరి రైతుల గురించి మనోజ్ ఏమాట్లాడారు, వారికి ఎలాంటి సర్వీస్ చేయబోతున్నారు అనేది ఈ రోజు సాయంత్ర మంచు మనోజ్ ఫేస్ బుక్ లైవ్ వీడియో చూస్తే తెలుస్తోంది. చూద్దాం మనోజ్ ఏం చేయబోతున్నారో? ఏం మాట్లాడబోతున్నారో?

English summary
Actor Manchu Manoj Birthday Celebrations held at near his residence in Film Nagar, Hyderabad. Manchu Manoj Kumar is an Indian film actor known for his works exclusively in Telugu cinema. Born to Telugu actor Mohan Babu,[2] Manoj first appeared at the age of ten as a child artist in Major Chandrakanth. Manoj made his film debut in a leading role with Donga Dongadi in 2004. He received state Nandi Special Jury Award for his work in Bindaas.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu