twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిస్క్ అని తెలిసినా... మహేష్ బాబును డేంజర్ ప్లేసుకు తీసుకెళ్లిన త్రివిక్రమ్!

    |

    'అరవింద సమేత' చిత్రంలో ఆకుతిను డైలాగ్ ద్వారా పాపులరైన మానిక్ రెడ్డి ఇటీవల ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ రచయితగా స్ట్రగుల్ అవుతున్న రోజుల నుంచే అతడితో స్నేహం ఉందని చెప్పిన మానిక్... అప్పటికీ ఇప్పటికీ అతడితో ఎలాంటి మార్పు లేదన్నారు.

    త్రివిక్రమ్ స్ట్రుగల్ అవుతున్న రోజుల్లో ఎలా ఉన్నాడో... ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆయన వద్ద ఉన్న గొప్ప క్వాలిటీ అది. ఆయనకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. దేని మీద వ్యామోహం కూడా లేదు. తన సినిమాల ద్వారా సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒక సందేశం ఇవ్వాలి అనే థాట్‌లో ఉంటాడని చెప్పుకొచ్చారు.

    కొత్తదనం కోసం ఎక్కడివరకైనా..

    కొత్తదనం కోసం ఎక్కడివరకైనా..

    త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నప్పటి నుంచే నాకు పరిచయం. ఏదైనా కొత్తగా చేయాలని పరితపించేవాడు. ఏదైనా కొత్త విషయం ఉందంటే దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడికైనా వెళ్లిపోతాడు. అతడికి పరిశీలన శక్తి ఎక్కువ.

     డేంజరస్ ఏరియాలో ‘అతడు' షూటింగ్

    డేంజరస్ ఏరియాలో ‘అతడు' షూటింగ్

    అతడు సినిమాలో ఓ సీన్ చార్మినార్ వద్దగల ఫారాషా హోటల్‌లో తీశారు. ఆ సీన్ త్రివిక్రమ్ ఓల్డ్ సిటీలోనే చేద్దామని పట్టుబట్టాడు. ఆ హోటల్ పర్మిషన్ కోసం దాదాపు నెల రోజులు తిప్పాడు. కొన్ని సీన్లు పాతబస్తీలోని డేంజర్ ఏరియాలైప మీర్ చౌక్, మీరాలం మండీ లాంటి ప్రాంతాల్లో చిత్రీకరించారని మానిక్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

    షూటింగ్ జరుగుతున్న విషయం ఎవరికీ తెలియకుండా

    షూటింగ్ జరుగుతున్న విషయం ఎవరికీ తెలియకుండా

    ‘అతడు' సినిమాలో మహేష్ బాబు మార్కెట్లో పరుగెత్తిన సీన్ అయితే పాతబస్తీలోని మోస్ట్ డేంజరస్ ఏరియా మీరాలం మండీలో తీశారు. మహేష్ బాబు అక్కడ ఉన్న విషయం, కెమెరాతో షూట్ చేస్తున్న విషయం, డైరెక్టర్ ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా షూటింగ్ పూర్తి చేశారని మానిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.

    త్రివిక్రమ్‌కు నిజమైన ఆనందం

    త్రివిక్రమ్‌కు నిజమైన ఆనందం

    కళ్లు మూసుకుని కూర్చోవడమే తపస్సు కాదు... మన వృత్తితో కూడా మనం తపస్సు చేయవచ్చని త్రివిక్రమ్ చెబుతుంటాడు. ‘నాకు నిజమైన ఆనందం.... నేను ఒక్కడిని కూర్చుని ఒక సబ్జెక్టు గురించి ఆలోచన చేస్తుంటే క్వశ్చన్‌కు ఆన్సర్, ఆన్సర్‌కు క్వశ్చన్ వేసుకుంటూ దాని ద్వారా తనను సంతృప్తి పరిచే విషయం రాబట్టినపుడు నిజమైన ఆనందం పొందుతాను' అని త్రివిక్రమ్ చెబుతుంటాడని మానిక్ రెడ్డి తెలిపారు.

     త్రివిక్రమ్ నీళ్లలాంటోడు...

    త్రివిక్రమ్ నీళ్లలాంటోడు...

    త్రివిక్రమ్ ఎక్కువగా మాట్లాడరు. సమయం వచ్చినపుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమీ తెలియని వాడిలా ఉంటాడు, కొన్ని సార్లు అన్నీ తెలిసిన వాడిలా ఉంటాడు, నీళ్లలో మనం ఏం వేసినా రంగు మారిపోతుంది. పాలు వేస్తే తెల్లగా, కుంకుమ వేస్తే ఎర్రగా మారుతుంది. త్రివిక్రమ కూడా అంతే అని మానిక్ రెడ్డి తెలిపారు.

    నీళ్లు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి

    నీళ్లు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి

    త్రివిక్రమ్ స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో కేవలం నీళ్లు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎవరి వద్ద చేయి చాచే అలవాటు ఆయనకు లేదు. ఆయన ఎప్పుడూ తన కష్టాల గురించి ఎవరికీ చెప్పడు. ఈ స్థాయికి వచ్చినా ఆయన వ్యక్తిత్వం అలాగే ఉంది అని మానిక్ రెడ్డి తెలిపారు.

    English summary
    Actor Manik Reddy about Director Trivikram. Manik Reddy, who essayed a variety role in Jr NTR starrer Aravinda Sametha, has said that he knows Tollywood director Trivikram for the last 20 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X