నితిన్‌తో పెళ్లిపై అందాల నటి మేఘా ఆకాశ్ క్లారిటీ..
టాలీవుడ్ యువ హీరో నితిన్, అందాల తార మేఘా ఆకాశ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపింది. వీరిద్దరూ లై చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. లై చిత్ర షూటింగ్‌లో నితిన్, మేఘా ఆకాశ్
టాలీవుడ్ యువ హీరో నితిన్, అందాల తార మేఘా ఆకాశ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపింది. వీరిద్దరూ లై చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. లై చిత్ర షూటింగ్‌లో నితిన్, మేఘా ఆకాశ్ మధ్య పరిచయం ప్రేమగా మారిందనే రూమర్ బలంగా వినిపించింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, వారి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా ఉందనే మాట వినిపించింది. ఈ విషయంపై మేఘా ఆకాశ్ క్లారిటీ ఇచ్చింది. నితిన్‌తో అఫైర్‌పై ఆమె ఏమన్నారంటే..
Recommended Video


ఆ వార్తలో వాస్తవం లేదు..
నితిన్‌తో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. పెళ్లి చేసుకొంటున్నారనే వార్తలో నిజం లేదు అని ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

డేట్లు అడ్జస్ట్ మాత్రమే
నితిన్ సినిమా కోసం డేట్లు అడ్జస్ట్ చేసుకోవడం వల్లనే ఓ చిత్రాన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అంతేకాని మా మధ్య అఫైర్ లేదు. నితిన్‌తో ప్రేమ వ్యవహారం అనే విషయం అనేది అవాస్తవం అని మేఘా ఆకాశ్ ఖండించింది.

నిరాధారమైన వార్తలు రాయొద్దు
నితిన్, నాకు మధ్య ఏదో సంబంధం ఉందని నిరాధారమైన వార్తలు రాయవద్దు అని మీడియాను మేఘా ఆకాశ్ కోరారు. లై చిత్రం తర్వాత ప్రస్తుతం నితిన్‌తో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి ఇంకా పేరు ప్రకటించలేదు.

‘జిందగీ’ నుంచి తప్పుకొన్న మేఘా ఆకాశ్
కాగా, లై చిత్రం తర్వాత రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రానికి మేఘా ఆకాశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ చిత్రం నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో నితిన్, మేఘా మధ్య అఫైర్ ఉంది అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఆ వార్తలకు తెరదించేందుకు మేఘా ఆకాశ్ ఇటీవల మీడియాతో మాట్లాడినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











