నన్ను దెబ్బకొట్టి రాజకీయాల్లోకి వచ్చాడు.. సినిమాలు హిట్టయితే గెలవలేరు: మోహన్ బాబు
సీనియర్ నటుడు మోహన్ బాబు చాలా రోజుల తరువాత రాజకీయాలపై స్పందించారు. ప్రస్తుతం సినిమాలను రాజకీయాలను అప్పుడప్పుడు టచ్ చేస్తున్న ఆయన వాటి మీద అంతగా ఇంట్రెస్ట్ లేదని అన్నారు. వినాయకచవితి సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు గతంలో జరిగిన ఒక మోసం గురించి అలాగే ప్రస్తుత సినిమా రాజకీయాల గురించి వివరణ ఇచ్చిన విధానం హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్.జగన్ ఆలస్యం చేసినా..
మోహన్ బాబు మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బావుంది. ఆ పార్టీకి నా మద్దతు ఉంటుంది. గతంలో నా విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజుల విషయంలో తెలుగు దేశం పార్టి ప్రభుత్వంపై విమర్శలు చేశాను. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఆలస్యం చేసినా సైలెంట్ గా ఉండడంతో అర్థముంది.

చంద్రబాబుతో మాట్లాడాను..
ఎందుకంటే వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఎన్ని సార్లు కోరినా కూడా కనీసం స్పందించలేదు. చాలాసార్లు చంద్రబాబుతో ఫోన్ లోనే ఫీజుల గురించి మాట్లాడాను. ఇక ప్రస్తుత సీఎం జగన్ తోనే తన కుమారుడు విష్ణు ఒక సీఈఓగా వెళ్లి మాట్లాడారు. అందుకు జగన్ సానుకూలంగా స్పందించి. త్వరలోనే బకాయిలు విడుదల చేస్తామని సమాధానం ఇచ్చారు.

సినిమాల్లో సక్సెస్ అయితే..
ఇక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినంత మాత్రాన రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారని అనుకోలేము. ముఖ్యంగా ఈ రోజుల్లో అది వర్కౌట్ కాదు. వాళ్ళ జాతకంలో రాసి ఉంటే అవ్వొచ్చేమో గాని ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సాధ్యం కాని పని. నా రాజకీయ జీవితంలో కూడా కొన్ని ఎదురుదెబ్బలు తిన్నాను.
Recommended Video

వాడు చేసిన మోసం..
ఇక నా రాజకీయాల విషయానికి వస్తే.. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ నేత నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. ఆ తరువాత వాడు చేసిన మోసానికి చాలా బాధపడ్డాను. వాడి పేరు కూడా నేను చెప్పాలని అనుకోవడం లేదు. ఆ తరువాత వాడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. నన్ను మోసం చేయడంతో చచ్చిన పాము అనుకోని వదిలేసా అని మోహన్ బాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











