అపుడు బిక్షం వేశారు, ఇపుడు డబ్బే ఇవ్వడం లేదు, మా పిల్లల పరిస్థితి ఏంటి?: మోహన్ బాబు ఫైర్
ఒక కాలేజీ అన్ని వసతులు, అధ్యాపకులతో ముందుకు సవ్యంగా సాగాలంటే డబ్బు కావాలి. ఇది ఒక వ్యక్తి వల్ల కాదు. నటుడిగా కష్టపడ్డాను. సంపాదించాను. సెల్ఫినెస్ లేకుండా నేను ఏదైనా చేయాలని నావంతు 25 శాతం కుల మతాలకు అతీతంగా 26 సంవత్సరాల నుంచి నేను స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. ఎంతో మంది పేద వారికి ఉచితంగా మన విద్యా సంస్థలో అవకాశం కల్పించాం. అలాంటి తమను చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మోహన్ బాబు ఫైర్ అయ్యారు.

ఎంతో మందికి మంచి జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు రాష్ట్రాలు కలిపి ఉన్నపుడు ఒక స్కీం పెట్టారు. ఎకనామికల్‌గా పూర్‌గా ఉన్నవారికి ఇంజనీరింగ్ విద్యను అందిస్తే బావుంటుందని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ పథకం పెట్టారు. దీని వల్ల లక్షల కోట్ల మందికి మంచి జరుగుతోంది. ఆయన పోయిన తర్వాత ఇది వద్దులే అని ఏ చీఫ్ మినిస్టర్ చెప్పలేదు.

బిక్షం వేశారు
2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో కరెక్టుగా మనకు అనుకన్న సమయాల్లో ఫీజు రీఎంబర్సమెంట్ ఇవ్వకపోగా అప్పుడప్పుడూ బిక్షం వేస్తున్నట్లు ఇచ్చారు. 2017-18లో ఈబీసీ నుంచి కాపు వారు అందులో వద్దు అని పక్కకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అనేది నా ప్రశ్న కాదు. వారికి సంబంధించి రూ. 2 కోట్ల 16 లక్షలు ఇవ్వాలి.

మా కాలేజీ పిల్లలను ఇబ్బంది పెట్టవద్దు
2018-19లో దాదాపు 16 కోట్ల చిల్లర బకాయిలు మా విద్యా సంస్థలకు రావాలి. ప్రభుత్వం వారు ఇస్తామంటే ఇస్తామని చెప్పండి. పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు. కాలేజీలను ఇబ్బంది పెట్టొద్దని మోహన్ బాబు సూచించారు.

మాట నిలబెట్టుకో
చంద్రబాబు పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు. అతడు ఏమైనా చేసుకోవచ్చు. ఇది వేదిక కాదు నేను మాట్లాడటానికి. ఈ రోజుకు నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. నీ బయట వాగ్దానాలు మాకు అనవసరం. మా పిల్లలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని మోహన్ బాబు ఫైర్ అయ్యారు.

ఇంకా ఎన్నాళ్లు తిప్పించుకుంటారు?
నేను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదారు మాసాలుగా ఉత్తరాలు రాశాను. డియర్ చంద్రబాబు ఇలా జరుగుతుంది. విద్యార్థులు గొప్పవారు కావాలంటున్నావ్. వారికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. ఇన్నిసార్లు ఉత్తరాలు రాసినా చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ఐఏఎస్ అధికారి రావత్ కూడా ఇస్తాం ఇస్తాం అంటూ మమ్మల్ని తిప్పించుకుంటున్నారని మోహన్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











