twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెలివిజన్ ఛానెళ్లపై మండిపడ్డ మోహన్ బాబు.. అసత్య ప్రచారం.. ఇంట్లోనే ఉన్నాను..!

    |

    Recommended Video

    Mohan Babu Condemns The Rumours Around His Imprisonment || Filmibeat Telugu

    మోహన్ బాబు గురించి ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. మోహన్ బాబు నటుడిగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. నిర్మాతగానూ రాణించారు. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా సంచలనంగా మారారు. హైదరాబాద్ లోనే ఎర్రమంజిల్ న్యాయస్థానం మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష విధించిందంటూ కొద్దిసేపటి క్రితమే మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది మంచు విష్ణు సలీం చిత్రానికి సంబందించిన వివాదం అని కూడా సదరు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మోహన్ బాబు అరెస్ట్ అంటూ వార్తలు రావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

    నేను ఇంట్లోనే ఉన్నా

    నేను ఇంట్లోనే ఉన్నా

    తనకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు, అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలపై మోహన్ బాబు స్వయంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడే విన్నా. కొన్ని మీడియా సంస్థలు నా గురించి అసత్య ప్రచారాలు మొదలుపెట్టాయి. నేను హైదరాబాద్ లో మా ఇంట్లోనే ఉన్నా అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. మంచు విష్ణు నటించిన సలీం చిత్రానికి మోహన్ బాబు నిర్మాత. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మోహన్ బాబు తనకిచ్చిన 48లక్షల చెక్ బౌన్స్ కావడంతో వైవిఎస్ చౌదరి 2010లో కేసు నమోదు చేశారు.

    కొన్ని మీడియా సంస్థల్లో

    కొన్ని మీడియా సంస్థల్లో

    తాజాగా ఈ కేసుపై ఎర్రమంజిల్ కోర్టు విచారణ జరిపి మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించిందని కొన్ని న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ వచ్చింది. మోహన్ బాబు 41 లక్షల జరిమానాకు గురయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వెంటనే స్పందించిన మోహన్ బాబు అసత్య ప్రచారం అంటూ ఖండించారు. ఈ వార్తల విషయంలో నిజా నిజాలు తేలాలంటే దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా స్పందించాలి. మోహన్ బాబు బెయిలుకు దరఖాస్తు చేసుకోవడం, మంజూరు కావడం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి.

    మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, 41 లక్షల జరిమానా.. కొడుకు సినిమా తెచ్చిన తంటా!మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, 41 లక్షల జరిమానా.. కొడుకు సినిమా తెచ్చిన తంటా!

    రాజకీయ కోణం

    రాజకీయ కోణం

    ఈ వార్తలో రాజకీయ కోణం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ మోహన్ బాబు తన స్పందనలో ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించలేదు. గత కొంత కాలంగా మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు ఇంకా చెల్లించలేదు అని మోహన్ బాబు అంటుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పుడో చెల్లించాం అని చెబుతోంది. మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ కూడా పరోక్షంగా చంద్రబాబుని విమర్శించిన సంగతి తెలిసిందే.

    వైవిఎస్ చౌదరి

    వైవిఎస్ చౌదరి

    మంచు విష్ణు వరుసగా పరాజయాల్లో ఉన్న సమయంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో సలీం చిత్రంలో నటించాడు. ఈ చిత్రం కూడా నిరాపరిచింది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలీం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చెక్ బౌన్స్ కేసులో అసలు నిజా నిజాలు ఏంటో వైవిఎస్ చౌదరి స్పందిస్తే కానీ తెలియదు. వైవిఎస్ చౌదరి కెరీర్ ఆరంభంలో లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య లాంటి వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత ప్లాపులు ఎదురుకావడంతో వైవిఎస్ చౌదరి సినిమాల జోరు తగ్గింది. 2015లో వచ్చిన రేయ్ చిత్రం తర్వాత వైవిఎస్ చౌదరి మరో చిత్రాన్ని ప్రారంభించలేదు.

    English summary
    Actor Mohan Babu responds on cheque bounce Case and says it is completely false. Director YVS Chowdary files this case on Mohan Babu in 2010. It is issue on Manchu Vishnu's Saleem movie directed by YVS Chowdary
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X