మంచు మోహన్‌బాబుకు పితృవియోగం
తిరుపతి : ప్రముఖ నటుడు, పద్మశ్రీ డాక్టర్ మోహన్‌బాబు తండ్రి మంచు నారాయణస్వామినాయుడు ఆదివారం అర్థరాత్రి ఇక్కడి విద్యానికేతన్ ప్రాంగణంలో కన్నుమూశారు. వయోభారంతో ఉన్న ఆయన అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా తనువు చాలించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుళపాళేనికి చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించారు. ఆయన మృతిపై మోహన్‌బాబు బంధువులు, ఆత్మీయులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ స్వామి నాయుడు వయస్సు 95 సంవత్సరాలు. నారాయణస్వామినాయుడుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో నారాయణస్వామి నాయుడు హెడ్‌మాస్టర్‌గా సేవలందించారు. నారాయణ నాయుడు మృతికి బంధువులు, అత్మీయులు, పలు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు. ధట్స్ తెలుగు ...ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications












