twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలకు గుడ్ బై.. ఆ పనుల్లో బిజీగా ఉన్నా : మోహన్ బాబు

    |

    గతంలో రాజ్యసభ ఎంపీగా పని చేసిన సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఇక మీదట రాజకీయాలకు దూరంగా ఉంటానని షాకింగ్ ప్రకటన చేశారు. అలాగే మంత్రి పేర్ని నాని గురించి కూడా రాజకీయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు

    రాజకీయం చేశారు

    రాజకీయం చేశారు

    మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన తన సినిమా విశేషాలతో పాటుగా రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ఆదివారం మీడియాతో ముచ్చటించిన ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇద్దరూ బంధువులేనని అన్నారు.. తన ఇంటికి మంత్రి పేర్ని నాని వస్తే పలు రకాలుగా ప్రచారం చేసి రాజకీయం చేశారని అన్నారు.

    అలా ఎలా అడగగలను

    అలా ఎలా అడగగలను

    తనకు మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తానే మంత్రిని తమ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని కోరారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా జగన్ తో జరిగిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలల పైన చర్చ జరగలేదని ఇంటికి వచ్చిన అతిధిని అలా ఎలా అడగగలను అని ఆమె ప్రశ్నించింది.

    ప్రత్యక్ష రాజకీయాలకు బై

    ప్రత్యక్ష రాజకీయాలకు బై

    అలాగే ఆయన ఇంకా మాట్లాడుతూ.. చంద్రబాబుకు గతంలో ప్రచారం చేసానని, 2019 ఎన్నికల్లో జగన్‌కు కూడా ప్రచారం చేసానని అయితే ఇప్పుడు తాను సినిమా వ్యవహారాలు.. తన యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నానని.. దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.

    మంత్రి నానీతో భేటీ

    మంత్రి నానీతో భేటీ


    మంత్రి నానితో జరిగిన సమావేశంపై వస్తున్న విమర్శల మీద తీవ్రంగా స్పందించిన మోహన్ బాబు.. ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా ఎంతో మంది ప్రముఖులు తన ఇంటికి అతిథులుగా వస్తారని మంత్రి తన ఇంటికి రావడంపై అనవసర రాద్ధాంతం చేయవద్దని అన్నారు. నిజానికి మంత్రి నానీతో భేటీ తర్వాత మంచు విష్ణు చేసిన ట్వీట్స్ లో చిరంజీవి బృందం సీఎంతో భేటీ గురించి మంత్రి నానీ తమకు వివరించారని వెల్లడించి తర్వాత మళ్ళీ ఆ ట్వీట్స్ డిలీట్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు అసలు ఆ ప్రస్తావనే రాలేదని పేర్కొన్నారు.

     ఫిబ్రవరి 18న

    ఫిబ్రవరి 18న

    ఇక మోహన్ బాబు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు. మేస్ట్రోఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో మోహన్ బాబుతో సహా శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు.

    English summary
    Actor Mohan Babu says he is Quitting Politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X