twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ravi Kishan: విలన్ కే చుక్కలు చూపించిన వ్యాపారవేత్త.. కోట్లలో మోసం, ఆ విలన్ ఎవరంటే?

    |

    మోసం పోవడం సినీ సెలబ్రిటీల్లో కూడా సాధారణమైపోయింది. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ద్వారా కోట్లు కోల్పోయిన నటులుంటే.. నమ్మిన వ్యక్తుల చేతిల్లో మోసపోయిన సెలబ్రిటీలు సైతం ఉన్నారు. పలువురిని సినిమా వాళ్లు చీటింగ్ చేయడం విన్నాం. ఆలాంటిది సినీ సెలబ్రిటీలు కూడా పలువురు చేతిలో మోసపోతున్నారు. ఇందుకు తాజాగా ప్రముఖ నటుడు, విలన్, బీజేపీ ఎంపీ రవి కిషన్ చీటింగ్ కు గురికావడమే. పైగా విలన్ గా రాణించిన రవి కిషన్ ఆయన స్నేహితుడు, వ్యాపారవేత్త చేతుల్లోనే మోసం పోవడం గమనార్హం. ఆ వివరాళ్లోకి వెళితే..

     మద్దాలి శివారెడ్డి పాత్రలో..

    మద్దాలి శివారెడ్డి పాత్రలో..

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం రేసుగుర్రం. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుంతగా నటించారు రవి కిషన్. ఈ సినిమాతో ఆయనకు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. మద్దాలి శివారెడ్డి పాత్రలో ఆయన అందరికీ గుర్తుండేలా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ఆయనకు అనేక చిత్రాల్లో అవకాశం లభించింది. బోజ్ పురికి చెందిన రవి కిషన్.. తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగులో వరుసగా సైరా నర్సింహా రెడ్డి, ఎమ్ఎల్ఏ, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, లై, రాధ, సుప్రీమ్, కిక్ 2, హీరో వంటి సినిమాల్లో నటించాడు.

     గోరఖ్ పూర్ ఎంపీగా..

    గోరఖ్ పూర్ ఎంపీగా..

    ప్రస్తుతం గోరఖ్ పూర్ ఎంపీగా సేవలందిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఒకరి చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త జితేంద్ర రమేష్ కు ఎంపీ రవి కిషన్ 2012లో రూ. 3.25 కోట్లు ఇచ్చాడట. వ్యాపార నిమిత్తం డబ్బు తీసుకున్న జితేంద్ర ఇప్పటి వరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదట. ఈ క్రమంలోనే తన డబ్బు తనకు ఇవ్వాల్సిందిగా కోరగా.. రూ. 34 లక్షలను 12 చెక్కుల రూపంలో జితేంద్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ చెక్కుల్లో ఒకదానిని గతేడాది డిసెంబర్ 7న బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయిందట. దీంతో జితేంద్రతో రవి కిషన్ మరోసారి చర్చలు జరిపినట్లు సమాచారం.

     ఎన్ని చర్చలు జరిగినా..

    ఎన్ని చర్చలు జరిగినా..

    అయితే ఎన్ని చర్చలు జరిగినా.. రవి కిషన్ డబ్బు తిరిగి వెనక్కి రాలేదట. దీంతో చేసేది లేక తన పీఆర్వో పవన్ దూబే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడట ఎంపీ రవి కిషన్. ఆయన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారని సమాచారం. సాక్ష్యాధారలతో జితేంద్రను కోర్టులో హాజరుపరచాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న కంటోన్మెంట్ పీఎస్ ఇన్ ఛార్జ్ శశి భూషణ్ రాయ్ ధ్రువీకరించినట్లు సమాచారం.

    English summary
    Resu Gurram Movie Villain And Gorakhpur BJP MP Ravi Kishan Filed Complaint Against Businessman Jitendra Ramesh For Cheating Over Rs 3.25 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X