twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరి వేసుకుంటానని చెప్పా: మురళీ మోహన్

    |

    Recommended Video

    Actor Murali Mohan About His Jayabheri Real Estate Business || Filmibeat Telugu

    దేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్లో రిచ్చెస్ట్ ఎవరు? అంటే మురళీ మోహన్, శోభన్ బాబు అనే వాదన ఉంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ స్పందించారు. ఇందులో సగం నిజం ఉందని, సగం అబద్దం ఉందని తెలిపారు. సగం నిజం శోభన్ బాబుగారు... ఆయన తనకు వచ్చిన ఆదాయంలో ప్రతీ రూపాయి, అవసరం అయితే అప్పు తెచ్చి సైట్లు కొనేవారు. ఆ రోజుల్లో ఆయన ఎకరం 5వేలకు కొన్నది ఎకరం 50 కోట్లు అయింది. అలా మద్రాస్ చుట్టపక్కల ప్రాంతాల్లో చాలా సైట్లు కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారత దేశంలో ఉన్న రిచ్చెస్ట్ సినిమా ఆర్టిస్టుల్లో శోభన్ బాబు ఒకరు. ఆయనతో పోల్చుకుంటే నాది 10 శాతం మాత్రమే అని మురళీ మోహన్ తెలిపారు.

    నాపై వచ్చిన ఆరోపణలతో బాధేసింది

    నాపై వచ్చిన ఆరోపణలతో బాధేసింది

    మనం నీతిగా, నిజాయితీగా ఉన్నపుడు ఎవరైనా తప్పుడు కామెంట్ చేస్తే చాలా బాధేస్తుంది. నేను చంద్రబాబు నాయుడుకి బినామీ అన్నారు. ఆయన అధికారంలో ఉన్నపుడు నాకు ప్రభుత్వ భూములు ఇచ్చారని, మాదాపూర్ ఏరియాలో ల్యాండ్స్ అన్నీ ఎన్ఆర్ఐలకు అమ్మానని... ఆ డబ్బే ఇదంతా అని కొందరు పెద్ద వ్యక్తులు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన వారిలో రాజశేఖర్ రెడ్డిగారు కూడా ఉన్నారు. వారి మాటలు నన్ను చాలా బాధించాయి... అని మురళీ మోహన్ తెలిపారు.

    ఏ తప్పూ చేయలేదు

    ఏ తప్పూ చేయలేదు

    ఏ తప్పూ చేయకున్నా నాపై ఆరోపణలు చేయడంతో కోపం వచ్చింది. వెంటనే ప్రెస్ మొత్తాన్ని పిలిచాను. చిన్నతప్పుకూడా చేయలేదని చెప్పాను. చంద్రబాబు నాయుడుగారికి, నాకు ఏ విధమైన బిజినెస్ సంబంధాలు లేవు, మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా లేవు, నేను ఏం బిజినెస్ చేస్తున్నాననే విషయం ఆయన ఎప్పుడూ అడగలేదు, నేనూ ఎప్పుడూ చెప్పలేదు, నేను చేసిన ప్రతీది కూడా రైతుల దగ్గర నుంచి భూములు కొని, డెవలప్ చేసి అమ్ముకున్నానే తప్ప గవర్నమెంట్ ఇచ్చిన సైట్లు అమ్మలేదని మురళీ మోహన్ తెలిపారు.

    చెట్టుకు ఉరివేసుకుంటానని చెప్పాను

    చెట్టుకు ఉరివేసుకుంటానని చెప్పాను

    నేను చిన్న తప్పు చేసినట్లు రుజువు చేసినా... మీరు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్దమని చెప్పాను. మీరు శిక్ష వేయడం కాదు...అసెంబ్లీ ఎదురుగా ఉన్న చెట్టుకు నాకు నేనుగా ఉరి వేసికుంటాను అని చెప్పాను. అలా మీరు నిరూపించకపోతే అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలన్నాను.... అంటూ గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి మురళీ మోహన్ వివరించారు.

    17 ఎకరాలు నష్టపోయాను

    17 ఎకరాలు నష్టపోయాను

    రాజకీయాల్లోకి ఎంటరవ్వడం వల్ల చాలా నష్టపోయాను. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన సమయంలో ముందు నా సైట్లో నుంచి రూట్ లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి వచ్చాక నాపై కోపంతో ప్లాన్ మార్చారో? లేక వారి సైట్లకు లాభం వచ్చేలా ప్లాన్ చేంజ్ చేశారో తెలియదు. నా సైట్లో నుంచి రోడ్డు వేయడం వల్ల 17 ఎకరాలు నష్టపోయాను... అని మురళీ మోహన్ తెలిపారు.

    English summary
    Actor Murali Mohan about his Jayabheri real estate business. Jayabheri was founded in 1987 by Mr. Murali Mohan along with Mr. Kishore and Mr. Ram Mohan, in their quest for creating a world-class real estate company. As the chief architect and promoter of the company, Mr.Murali Mohan is driving the vision and the purpose of the company.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X