twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బు కోసం కాదు.. వ్యక్తిత్వం నచ్చడం వల్లే.. నాగబాబు

    |

    కెఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలరాశేఖరుని దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్‌ హీరోగా ప్రదీప్‌ కెఆర్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'నాయనా రారా ఇంటికి (ఎన్‌.ఆర్‌.ఐ). ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటి అక్కినేని అమల క్లాప్‌ నివ్వగా, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌ను బాలరాజశేఖరుని డైరెక్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ..

     ఐదేళ్లలో ఎన్నడూ కలువలేదు

    ఐదేళ్లలో ఎన్నడూ కలువలేదు

    మెగాబ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ ''బాలరాజశేఖరుని పేరు ఎంత చక్కగా ఉంటుందో మనిషి కూడా అంత మంచివాడు. ఆయనకు చాలా డిగ్రీలు ఉన్నాయి. అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌లో డీన్‌గా పనిచేస్తున్నారు. అన్నపూర్ణలోనే ఐదు సంవత్సరాలు జబర్దస్త్‌ చేసినా మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ సినిమా ద్వారా మేం కలవడం జరిగింది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. కొన్ని సినిమాలు డబ్బు కోసం చేస్తాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం బాల వ్యక్తిత్వం నచ్చడం. చాలా మంచి కథ ఇది. పిల్లల్ని మిస్‌ తల్లిదండ్రుల పెయిన్‌ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చెయ్యడం జరిగింది'' అన్నారు.

     అమెరికాలోని సాధకబాధకాలు చూసి

    అమెరికాలోని సాధకబాధకాలు చూసి

    సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ''బాల ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ సాధకబాధకాల్ని చవి చూశాడు. అలాగే విజయాలు కూడా చవి చూశాడు. బాలరాజశేఖరుని అంటే స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌లాంటి వారికి మంచి మిత్రుడు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి సినిమా తీద్దామనుకునే వారికి ఎంతో సహాయపడేవాడు. అతను డైరెక్టర్‌ అయితే బాగుంటుందన్న కోరిక నాకు ఎప్పటి నుంచో వుంది. ఈ సినిమాతో డైరెక్టర్‌ అవుతున్నాడని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఈ సినిమాతో దర్శకుడుగా బాల మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను'' అన్నారు.

     హాజరైన హీరోలు నాని, సుశాంత్, నాగశౌర్య

    హాజరైన హీరోలు నాని, సుశాంత్, నాగశౌర్య

    ఎన్నారై సినిమా ప్రారంభోత్సవానికి హీరోలు నాని, సుమంత్‌, సుశాంత్‌, నాగశౌర్య, అఖిల్‌, మంచు లక్ష్మి, ప్రముఖ రచయిత, దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అవసరాల శ్రీనివాస్‌, హీరోయిన్‌ మహతి, నటుడు నాగబాబు, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ, నిర్మాత ప్రదీప్‌ కె.ఆర్‌., దర్శకుడు బాలరాజశేఖరుని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

     నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, మహతి, నాగబాబు, మంచు లక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి. దిలీప్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: యోగేశ్వరశర్మ ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సింధూజ, కాస్ట్యూమ్స్‌: హర్ష, ఫైట్స్‌: ఆర్‌.భరత్‌కుమార్‌, స్టిల్స్‌: రఘు, కో-డైరెక్టర్‌: సూర్య ఎంజమూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డా.కిరణ్‌కుమార్‌, నిర్మాత ప్రదీప్‌ కె.ఆర్‌., రచన, దర్శకత్వం: బాల రాజశేఖరుని.

    English summary
    Actor Avasarala Srinivas latest movie Nayana Rara Intiki (NRI) has started. Directed by Bala Shekharuni. Produced by Pradeep KR. Nani, Amala, Sushanth, Naga Shourya, Akhil, Manchu Lakshmi are attendees for this opening ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X