మొహం మీద గాయాలు.. సిగరెట్ కాల్చుతూ కనిపించిన నాగబాబు.. ఫొటోస్ వైరల్
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు హీరోగా ప్రయత్నాలు చేసి ఆ తరువాత ఒక క్యారెక్టర్ యాక్టర్ సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఎన్నో సపోర్టింగ్ రోల్స్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నాగబాబు ఆ తరువాత మెల్లమెల్లగా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మరో స్థాయికి చేరుకున్నారు. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఎదో ఒక పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తుంటారు. ఆయన పనులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంన్నాయనే చెప్పాలి. అయితే రీసెంట్ గా నాగబాబు పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి.

ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ అయితే
మెగా ఫ్యామిలీపై ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ అయితే ఆ కాంట్రవర్సీలపై మొదటి వ్యక్తిగా నాగబాబు స్పందిస్తూ ఉంటారు. ఇక యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నారు. ఆయనే చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కేవలం రాజకీయాలపైనే కాకుండ వివిధ రకాల ఘటనలపై కూడా నాగబాబు తన ఛానెల్ ద్వారా వివరణ ఇస్తున్నారు.

ఆ షో ద్వారా మరో లెవెల్ కు..
మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన నటులలో అందరూ కూడా హీరోలుగా చక్రం తిప్పుతున్నవల్లే. మెగా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నాగబాబు మాత్రం నటుడిగా విభిన్న పాత్రలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందునున్నాడు. జబర్దస్త్ షో ద్వారా ఆయన క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్
అయితే కొన్నేళ్ల అనంతరం పలు వివాదాల కారణంగా షో నుంచి తప్పుకోవడంతో అప్పట్లో ఆ న్యూస్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ నుంచి బయటకు రాగానే నాగబాబు మరింత కొత్తగా ఆలోచించి సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆ ఛానెల్ లో కామెడీ అలాగే సందేశాత్మక విషయాలను చెబుతున్నాడు. తొందరగా డబ్బు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ తో ఆయాన్ ఛానెల్ కు మంచి క్రేజ్ దక్కింది.

అలా ఆదాయాన్ని పెంచుకుంటూ..
కొంతమంది కమెడియన్స్ తో కలిసి నాగబాబు ఖుషిఖుషీగా అనే స్టాండ్అప్ కామెడీ షోను నడుపుతున్నారు. యూ ట్యూబ్ ద్వారా కొత్త వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. అంతే కాకుండా యూ ట్యూబ్ ద్వారా ఆదాయాన్ని అందుకోవడంలో నాగబాబు చాలా డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నారు.

సీరియస్ లుక్ వైరల్
ఇక చాలా రోజుల తరువాత నాగబాబు ఒక సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు. మొహం మీద గాయాలతో నోట్లో సిగరెట్ పెట్టుకొని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చారు. ఎదో కొత్త సినిమా కోసం ఇలా రెడీ అయ్యి ఉంటారేమో అని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఈ లుక్ అయితే ఇంటర్నెట్ ప్రపంచంలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. మరి నాగబాబు ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











