ఉప్పెనపై నాగబాబు రివ్యూ.. ఇలాంటి కథను చేయొద్దు.. నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. కానీ!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైష్ణవ్ నటించిన ఉప్పెన సినిమా క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికి.. ముఖ్యంగా విజయ్ సేతుపతి, కృతి శెట్టి పెర్ఫార్మెన్స్ గురించి గొప్పగా మాట్లాడుకొంటున్నారు. ఈ క్రమంలో ఉప్పెన సినిమాపై మెగా బ్రదర్ నాగబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..

ఉప్పెన డిఫరెంట్ మూవీ
ఉప్పెన సినిమా చూశాను. చాలా విభిన్నమైన చిత్రం. ఈ సినిమా చేసినందుకు వైష్ణవ్‌ను అభినందించాలి. ఇలాంటి కంటెంట్‌ను ఒప్పుకోవడమే వాడి ధైర్యం. అంత రిస్క్ కంటెంట్‌ను చేయడమే రిస్క్. అలాంటి కంటెంట్ సినిమాను చేసి ఒప్పించాడు. యాక్టర్‌గా ఇంతకంటే ఎక్కువ రిస్క్ చేయలేడేమో అని నాగబాబు అన్నారు.

మైత్రీ మూవీస్‌ను అభినందించాలి
ఉప్పెన లాంటి రిస్క్ కంటెంట్‌ను ఆన్ స్క్రీన్‌లోకి తీసుకురావాలని మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. నేనే ప్రొడ్యూసర్‌ను అయితే నేను ఒప్పుకోను. రిస్క్ చేయను. రిస్క్ అంటే డూ ఆర్ డై కంటెంట్. అంత రిస్క్ తీసుకొన్న ప్రొడ్యూసర్స్‌ను మెచ్చుకోవాలి. ఎందుకంటే కోట్లతో కూడిన వ్యవహారాన్ని భుజాన వేసుకొని ఉప్పెన సినిమాను రూపొందించినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని నాగబాబు అభిప్రాయపడ్డారు.

నేనైతే వద్దని చెప్పేవాడిని
వైష్ణవ్ కెరీర్‌లో తొలి సినిమాకు ఇలాంటి కథను చేయమని ఎవరైనా అడిగి ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించి ఉండేవాడిని కాదు. ఎంత పెద్ద కథైనా తొలి సినిమాకు ఇలాంటి కథను చేయవద్దని చెప్పేవాడిని. వైష్ణవ్‌కు మున్ముందు ఇంతకంటే సూపర్‌హిట్లు రావొచ్చు. కానీ ఇంత పెద్ద రిస్క్ ఉన్న సినిమా ఇక ముందు రాకపోవచ్చేమో అని నాగబాబు అభిప్రాయపడ్డారు.

విజయ్ సేతుపతి అన్‌బిలీవబుల్
ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్ అన్ బిలివబుల్ ఫెర్ఫార్మెన్స్. హాలీవుడ్ రేంజ్ ఫెర్ఫార్మర్. అతడి సినిమాలు చాలా చూశాను. పిజా సినిమా చూసినప్పుడే ఏంటీ ఇతను ఇలా చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగింది. రెండోసారి ఆ సినిమా చూసినప్పుడు అతనిలోని నటుడిని కాకుండా క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తున్నారని అనిపించింది. క్యారెక్టర్‌క్‌కు ఎంత కావాలో అంతే చేస్తాడు అని నాగబాబు పేర్కొన్నారు.

కెరీర్‌ను పణంగా పెట్టిన బుచ్చిబాబు
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు విషయానికి వస్తే.. ఆయన కథ కాబట్టి. ఆయన జీవితంలో గొప్ప కథ చేద్దామని ఫీల్ అయి ఉండవచ్చు. ఇలాంటి కథను చేసిన తీరును చూస్తే అతడు తన కెరీర్‌ను పణంగా పెట్టి చేశాడనిపించింది. చావోరేవో అని తేల్చుకొందామనుకొన్న కుర్రాడు. సినిమాను అద్భుతంగా చేశాడు అని నాగబాబు పేర్కొన్నారు.

మూడు మతాల సామరస్యతతో
ఉప్పెన చిత్రంలో మూడు మతాలను ఒక సామరస్యంగా తీసుకొని కథను చెప్పాడు. అద్భుతమైన కథను చెప్పాడు. ఒక భయంకరమైన విలన్ చూపించాడు. ఓ తండ్రి, కొడుకుల కథను చెప్పాడు. పునరావాసం అనే బ్యాక్ డ్రాప్ చాలా బాగున్నది. జాలర్ల జీవితం ఎంత కష్టంగా ఉంటుందనే విషయాన్ని చక్కగా చూపించాడు అని నాగబాబు తెలిపారు.

మొదటి సినిమాలోనే వైష్ణవ్ అద్భుతంగా
వైష్ణవ్ మొదటి సినిమాలోనే అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ చేశాడు. ఇలాంటి కథను చేయాలంటే చాలా గట్స్, ధైర్యం ఉండాలి. రెండోసారి చూస్తే తప్ప అతడి ఫెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. క్యారెక్టర్‌ను మాత్రమే ఎలివేట్ చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను.. నాకో చరిత్ర ఉందనే యాటిట్యూడ్ చూపించలేదు. ఆశీ.. అశీర్వాదం అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించలా చూపించాడు. అని నాగబాబు చెప్పారు.


Click it and Unblock the Notifications











