గీతా మాధురి భర్త పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా లేవు.. BB అంటూ నందు రచ్చ .. అందుకోసమే ఇదంతా!!
ప్రస్తుతం అంతా బిగ్‌బాస్ హవానే నడుస్తోంది. ఎప్పుడు మొదలవుతుంది? ఎంత మంది కంటెస్టెంట్స్ వస్తున్నారు? వారు ఎవరు? అంటూ లీకుల మీద లీకులు వెలువడుతూనే ఉన్నాయి. రోజుకో కొత్త లిస్ట్ లీకవ్వడం అందులో కొత్త కొత్త సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అసలే ఇప్పుడు బిగ్ బాస్ హవా నడుస్తూ ఉంటే BBలోకి ఉన్నాను, వెళ్తున్నాను అంటూ గీతా మాధురి భర్త చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయితే చాలా మంది అది బిగ్ బాస్ గురించి అనుకుంటున్నారు. కానీ కొంత మంది అది పబ్లిసిటీ స్టంట్ అని ఇట్టే పసిగట్టారు. ఎందుకంటే ఇంత వరకు అలా ప్రకటించి వెళ్లిన వారు లేరు. అది అసలు నియమాలకు విరుద్దం.

బిగ్‌బాస్ 4లో నందు..?
బిగ్ బాస్ నాల్గో సీజన్ గురించి వార్తలు రావడం మొదలు పెట్టిన క్షణం నుంచి రాబోయే కంటెస్టెంట్ల లిస్ట్‌లో నందు పేరు ఉంటూ వచ్చింది. అయితే గీతా మాధురి ఆల్రెడీ బిగ్‌బాస్ సెకండ్ సీజన్‌లో పాల్గొనడంతో.. నందు కూడా వెళ్లొచ్చు అనే కోణంలో ఈ వార్తలు వచ్చాయి. ప్రతీ లిస్ట్‌లో నందు పేరు ఉంటూ వచ్చింది. అయితే ఇవి తప్పుడు వార్తలను తాజాగా రుజువైంది.

బిగ్ అనౌన్స్‌మెంట్..
నందు ఆగస్ట్ 23న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. బాసు రేపు బిగ్( BIGG) అనౌన్స్మెంట్.. ఎంతో ఆత్రుతగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు. దాంట్లో బిగ్ అనే అక్షరాలను పెద్దగా రాయడంతో అందరూ బిగ్ బాస్ ప్రకటన అనుకున్నారు. అనుకున్నట్టుగా నిన్న ఓ మరో పోస్ట్ చేశాడు.

BBలో మన రచ్చ..
డార్లింగ్స్ నేను BBలో ఉన్నాను.. BBలో మన రచ్చ మామూలుగా ఉండదు.. ఎంతో వినోదాన్ని పంచడానికి మీ ముందుకు వస్తున్నాను.. మీ మద్దతు మరింత కావాలి.. రేపు (ఆగస్ట్ 25) సాయంత్రం ఆరుగంటలకు ఇంకో అప్డేట్ రెడీగా ఉంది.. చూస్తూనే ఉండండి అని నందు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

పసిగట్టిన నెటిజన్స్..
BB అంటే బిగ్ బాస్ కాదని జనాలకు అర్థమైంది. ఎందుకంటే షో నిబంధనల ప్రకారం.. బిగ్ బాస్‌లో పాల్గొనబోతోన్నానని బయటకు చెప్పడం నిషిద్దం. ఇలా BB అంటూ చెప్పడంతో తాను బిగ్ బాస్‌లో లేనని, క్లారిటీ ఇస్తూనే ఈ సిట్యువేషన్‌ను వాడుకున్నాడని తెలుస్తోంది.
Recommended Video

కొత్త ప్రాజెక్ట్ ప్రకటన..
నేటి సాయంత్రం నందు తన కొత్త సినిమా ప్రకటన చేయబోతోన్నాడు. సినిమా పేరు BB (బొమ్మ బ్లాక్ బస్టర్), BB (బ్లాక్ బస్టర్) లేదా బరాబర్ అని తెలుస్తోంది. అందుకే తెలివిగా BB అని చెప్పుకొచ్చాడు. జనాలు కన్ఫ్యూజ్ అయి అది బిగ్ బాస్ అనుకుంటారని, వైరల్ అవుతుందని అతని స్కెచ్. అనుకున్నట్టు పాచికలు పడ్డాయి. నందు చేసిన రచ్చతో కొత్త ప్రాజెక్ట్‌పై హైప్ వచ్చింది. ఇక సినిమా టైటిల్ ఏంటన్నది అఫీషియల్‌గా తెలియాలంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











