మొత్తానికి అనుకున్నది సాధించేశాడు.. జనాల నాడిని పట్టేశాడు.. నందు మామూలోడు కాదు!!
BBలో ఉన్నాను.. మరింత వినోదాన్ని పంచేందుకు వస్తున్నా అంటూ నందు ప్రకటించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా వేడెక్కింది. BB అంటే నందు ఉద్దేశ్యంలో ఏది అయినప్పటికీ.. ప్రస్తుత వ్యవహార భాషలో అది బిగ్ బాస్ అనే అనుకుంటారు. అయితే BB అంటే బిగ్ బాస్ కాదు. ఈ విషయం అందరూ పసిగట్టారు కూడా. ఇలా అందరూ కనుక్కోవడంతోనే BB అంటే ఏంటో బయటకు చెప్పడంలో నందు మంచి స్ట్రాటజీ ప్లే చేశాడు.

బిగ్ అనౌన్స్‌మెంట్..
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లిస్ట్‌లో నందు పేరు సర్క్యులేట్ అవుతుండటంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. నందు ఆగస్ట్ 23న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. బాసు రేపు బిగ్( BIGG) అనౌన్స్మెంట్.. ఎంతో ఆత్రుతగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు.

BBలో మన రచ్చ..
ఆగస్ట్ 24న మరో పోస్ట్ చేస్తూ.. డార్లింగ్స్ నేను BBలో ఉన్నాను.. BBలో మన రచ్చ మామూలుగా ఉండదు.. ఎంతో వినోదాన్ని పంచడానికి మీ ముందుకు వస్తున్నాను.. మీ మద్దతు మరింత కావాలి.. రేపు (ఆగస్ట్ 25) సాయంత్రం ఆరుగంటలకు ఇంకో అప్డేట్ రెడీగా ఉంది.. చూస్తూనే ఉండండి అని నందు పేర్కొన్నాడు.

లేట్ చేస్తూ మరో స్ట్రాటజీ..
అయితే BB అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆత్రుత మాత్రం జనాల్లో బాగానే పెరిగింది. అందుకే BB మీనింగ్ తెలుసుకునేందుకు నిన్న సాయంత్రం ఆరుగంటలకు సోషల్ మీడియాలో కాచుని కూర్చున్నారు. అయితే ఎంతకీ అప్డేట్ రాలేదు. తీరిగ్గా ఓ రెండు గంటలు ఆలస్యంగా వచ్చి ఓ అప్డేట్ ఇచ్చాడు.
Recommended Video

అది ఇది కాదు..
ఆ ఆప్డేట్‌లో కూడా BB మీనింగ్ చెప్పలేదు. జనాల్లో ఏర్పడ్డ కన్ఫ్యూజన్‌ను వాడుకున్నాడు. BB అంటే బిగ్ బాస్ అని అనుకుంటున్నారని నందుకు కూడా తెలుసు. అందుకే అది ఇది కాదు.. ఇది అది కాదు.. అదే ఇది.. ఇదే అది.. అంటూ ఇస్మార్ట్‌గా నాటకాలు ఆడుతున్నాడు. ఇక అసలైన అప్డేడ్ ఎప్పుడిస్తాడో చూడాలి. BBపై వస్తోన్న ట్రోలింగ్, మీమ్స్‌ను ఎంజాయ్ చేస్తోన్న నందు.. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుని మరీ పబ్లిసిటీ చేసుకుంటాడు. మొత్తానికి BBని జనాల్లోకి తీసుకెళ్లడంలో నందు సఫలమయ్యాడు.


Click it and Unblock the Notifications











