Don't Miss!
- News
వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి గుడ్ బై ? ఇన్ ఛార్జ్ రెడీ చేసుకుంటున్న జగన్ !
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
నువ్ ఏదో పెద్ద స్టార్ అయినట్టు.. మాకెందుకీ టైం బొక్క!!.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నందు
నటుడు, హీరో నందు (గీతా మాధురి భర్త) ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తున్నాడు. BB అంటూ సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకున్నాడు. BBలో ఉన్నాను.. ఇక మరింత వినోదాన్ని పంచుతాను.. మీ అందరి సపోర్ట్ కావాలంటూ తన తదుపరి చిత్రం కోసం అద్భుతమైన ప్రమోషన్స్ చేసుకున్నాడు. BB అంటే అందరూ బిగ్ బాస్‌కు సంబంధించిన అప్డేట్ అంటూ.. ఎంతో ఆశగా ఎదురుచూశారు.

సర్‌ప్రైజ్ ఇచ్చిన నందు..
BB అంటూ రచ్చ చేసిన నందు తదుపరి అప్డేట్ ఇవ్వడానికి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అది ఇది కాదు.. ఇది అది కాదు.. అదే ఇది.. ఇదే అది.. అంటూ తెగ కన్ఫ్యూజ్ చేసేశాడు. ఇక మొత్తానికి BB అంటే ఏంటో అందరికీ చెప్పేశాడు. BB అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ, అది తన తదుపరి ప్రాజెక్ట్ అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు.

ట్రోల్స్‌తో ఎంజాయ్..
నందు ట్రోలింగ్, మీమ్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే హెల్దీ కామెంట్స్‌పై ఎంత పాటిజివ్‌గా రియాక్ట్ అవుతాడో నెగెటివ్ కామెంట్స్‌పైనా అంతే స్థాయిలో కౌంటర్ వేస్తాడు. తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై నందు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సదరు నెటిజన్‌కు ఇచ్చిన రిప్లైను అందరూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

బర్త్ డే సందర్భంగా అప్డేట్..
నందు బర్త్ డే నేడు (సెప్టెంబర్ 3) ఈ మేరకు ఓ అప్డేట్ రాబోతోందని పోస్ట్ చేశాడు. ఇక దీనిపై ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. డైరెక్ట్‌గా రిలీజ్ చేయ్ బ్రో.. చూసి చస్తం.. ఏదో పెద్ద సూపర్ స్టార్‌లా అప్డేడ్ పోస్ట్ ఎందుకు టైం బొక్క అంటూ కాస్త కించపరిచినట్టు కామెంట్ పెట్టాడు.

దిమ్మతిరిగే కౌంటర్..
ఇక నందు సదరు కామెంట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మళ్లీ మీలాంటోళ్లే వచ్చి నెపోటిజం, తొక్క, బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సపోర్ట్ చేయాలని పోస్ట్‌లు పెడతారు.. సూసైడ్ చేసుకుంటే తప్పా బ్యాక్ గ్రౌండ్ లేనోడికి సపోర్ట్ చెయ్యని మీ లాంటి సూడో బ్యాచ్‌కి దండం.. అయినా ఏ స్టార్ అని నేను చెప్పుకోలేదు.. నువ్వే ఇన్ డైరెక్ట్‌గా తగిలిస్తున్నవ్ అని కాస్త గట్టిగానే బదులిచ్చాడు.