»   » తప్పతాగి పబ్‌లో హీరో వీరంగం, ఒకరిపై దాడి

తప్పతాగి పబ్‌లో హీరో వీరంగం, ఒకరిపై దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో పలువురు సినీ స్టార్స్ వివిధ అసాంఘీక కార్యకలాపాలు, గొడవలు, దాడులు లాంటి సంఘటనలతో వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పబ్‌లో పీకలదాక తాగిన సినీనటుడు ఓ యువకుడిపై దాడి చేసి గాయపర్చాడు.

సదు నటుడు మరెవరో కాదు..... ‘పరారె' చిత్రంలో నటించిన తోలుగు సినీ నటుడు నందూరి ఉదయ్ కిరణ్. అందరూ అతన్ని బాబీ అని పిలుస్తుంటారు. గతంలో ఇతగాడి పేరు డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది. ఇపుడు గొడవకు కారణం కూడా సదరు డ్రగ్స్ కేసు వ్యవహారమే.

Actor Nanduri Uday Kiran Arrested

ఉదయ్ కిరణ్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఎయిర్ పబ్ కు వెళ్లాడు. ఇదే పబ్‌కు ప్రవీణ్‌కుమార్‌ అనే యువకుడొచ్చాడు. ప్రవీణ్‌ను చూడగానే ఉదయ్‌కిరణ్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను డ్రగ్స్‌ కేసులో అక్రమంగా ఇరికించాడంటూ ప్రవీణ్‌పై దాడిచేశాడు.

గొడవ తీవ్రం కావడంతో పబ్ నిర్వాహకులు పోలసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఉదయ్ కిరణ్ తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసారు. ఉదయ్‌కిరణ్‌పై 506, 326 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Upcoming Telugu actor Nanduri Uday Kiran was arrested in Assault case.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu