»   » షాకింగ్....హీరో నానికి ఇంత ఫాలోయింగా?

షాకింగ్....హీరో నానికి ఇంత ఫాలోయింగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నాని ఇంతింతై... అన్నట్లు శరవేగంగా ఎదుగుతున్నాడు. సాధారణ క్లాప్ బాయ్‌గా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టిన నాని 'అష్టా చెమ్మా' చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. నాని టాలెంటుకు తోడు... రొట్టి విరిగి నేతిలో పడ్డట్లు తొలి సినిమా హిట్టైంది.

ఆ తర్వాత అలా మొదలైంది, పిల్ల జమిందార్ లాంటి హిట్లు రావడంతో....ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రంలోనూ నటించే అవకాశం దక్కింది. దీంతో నాని రేంజి ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అప్పటి నుంచి నానికి ప్రేక్షకుల్లో ఫోలోయింగ్ బాగా పెరిగింది.

ప్రస్తుతం నానికి ఫాలోయింగ్ ఏరేంజిలో ఉదంటే....స్టార్ హీరోలతో సైతం పోటీ పడుతూ ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్‌లో దూసుకెలుతున్నాడు. తాజాగా నానిని ఫేస్ బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 7 లక్షలకు మార్కును అందుకుంది. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా అనతి కాలంలో ఈ రేంజికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

ప్రస్తుతం నాని...తెలుగులో జెండాపై కపిరిజు చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు ఆయన కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసిన 'పైసా' మూవీ విడుదల కావాల్సి ఉంది. హీరోగా పరిచయం కాక ముందు అసిస్టెంటు డైరెక్టర్‌గా కూడా పని చేసిన నాని, ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్ణం పరీక్షించుకుంటున్నాడు. 'డి ఫర్ దోడిపి' చిత్రం నిర్మాణ టీమ్ లో హీరో నాని కూడా జాయిన్ అయ్యారు.

English summary
Nani is one of the popular Telugu actors and that reflects in the number of followers on his social networking page, Face Book. Actor Nani has 7 lakh followers on Face Book.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu