నాని క్రేజీ కాంబినేషన్స్..మార్కెట్ పెరిగే విధంగా పవర్ఫుల్ లైనప్..లిస్టులో న్యూ డైరెక్టర్

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు నేచురల్ స్టార్ నాని. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టైర్ 2 హీరోల జాబితాలో చేరిపోయాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో నాని మార్కెట్ 40 కోట్ల వరకు ఉందనే మాట వినిపిస్తుంది. ఆయన సినిమాల బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. అలాగే 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక దసరా సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం ద్వారా నాని తన రేంజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతం మంచి బజ్ ఉంది. ఇప్పటికే దసరా సినిమా వంద కోట్ల వరకు బిజినెస్ జరిగిందనే మాట వినిపిస్తుంది.

Actor nani interesting line up with talented directors upcoming movies

ఇక ఈ సినిమా తర్వాత నాని సినిమాల లైన్ అప్ కూడా చాలా గ్రాండ్ గా ఉందని చెప్పాలి. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి నాని రెడీ అయిపోతున్నాడు. ఇదిలా ఉంటే దసరా తర్వాత కొత్త దర్శకుడు శౌర్యువ్ తో నాని తన 30వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 31వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కబోయే హిట్ 3 మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.

Actor nani interesting line up with talented directors upcoming movies

శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుంది. ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని నాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అందరి హీరోల మాదిరి అన్ని పాన్ ఇండియా లెవల్ లోనే కాకుండా కథకి యూనివర్సల్ అప్పీల్ ఉంటే మాత్రమే వాటిని అన్ని భాషలలో రిలీజ్ చేసే విధంగా నాని ప్రణాళికలు వేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X