»   »  సినిమాలో బాలయ్య అభిమానిని, నిజ జీవితంలో కాదు...(నాని ఇంటర్వ్యూ)

సినిమాలో బాలయ్య అభిమానిని, నిజ జీవితంలో కాదు...(నాని ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ'. ‘అందాల రాక్షసి' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిభ్రవరి 12న విడుదలవుతుంది.

సినమా రిలీజ్ సందర్భంగా హీరో నాని మీడియాతో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఇందులో హీరో నాని బాలయ్య అభిమానిగా నటిస్తున్నారు. తన పాత్ర గురించి నాని మాట్లాడుతూ...‘హీరో పాత్ర బాలకృష్ణగారి అభిమాని కావడం ఇదే తొలిసారి. హిందూపురం, అనంతపురం ప్రాంతాల్లో ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది బాలయ్య అభిమానులే. నా చేతిమీదుండే ‘జై బాలయ్య' అనే టాట్టూకీ, సినిమా మొత్తానికీ సంబంధం ఉంటుంది. ఎవరి ప్రభావం లేకుండా నేనే బాలయ్య అభిమానినైతే ఎలా ఉంటానో అలాగే చేశాను' అన్నారు నాని.

నే ఈ సినిమాలో బాలకృష్ణగారి వీరాభిమానిగా కనిపించినా...నిజ జీవితంలో మాత్రం నేను కమల్‌హాసన అభిమానిననే విషయం అందరికీ తెలిసిందే. తెలుగుకు వస్తే సినిమా సినిమాకీ మారుతుంటుంది. ఎవరి సినిమా బాగుందనిపిస్తే వాళ్ల అభిమానినైపోతాను అచి చెప్పుకొచ్చారు నాని.

బాలయ్య ఎగ్జైట్ అయ్యారు

బాలయ్య ఎగ్జైట్ అయ్యారు


సినిమాలో నేను బాలయ్య అభిమానినని తెలిసినప్పుడు ఆయన ఎగ్జయిట్‌ అయ్యారు. నాకు తెలిసి ఈ సినిమాని వంద శాతం ఆయన మొదటి రోజే చూస్తారనుకుంటాను అన్నారు నాని.

బాలయ్య గెస్ట్ రోల్ అనుకున్నారు..

బాలయ్య గెస్ట్ రోల్ అనుకున్నారు..


బాలకృష్ణగారిని ఓ సన్నివేశంలోనైనా గెస్ట్ రోల్ లో చూపిస్తే ఎలా ఉంటుందా.. అని అనుకున్నారు. రెండో షెడ్యూల్లో ఉన్నప్పుడు ఆయన్నోసారి కలిశాం. అయితే కథ పక్కదారికి మళ్లుతుందనీ, బాలయ్యను ఎక్కడో రాయలసీమలోని ఓ ఊళ్లో ఉండే కృష్ణగాడు కలిసినట్లు చూపిస్తే, మరీ సినిమాటిక్‌గా ఉంటుందనుకొని ఆ ఆలోచనను మానుకున్నామని తెలిపారు.

ఇది కృష్ణగాడి కథ

ఇది కృష్ణగాడి కథ


ఈ సినిమా పూర్తిగ కృష్ణ అనే వ్యక్తి కథ. ప్రధానంగా ప్రేమకోసం అతడు చేసిన రిస్కేమిటనేదానిపై నడిచే కథ. కృష్ణ అనే ఓ పిరికోడు ప్రేమకోసం ఏం చేశాడనేది ఇందులోని ప్రధానాంశం. ‘కథ' అనకుండా ‘గాథ' అనడంలో ఓ ఫెయిరీటేల్‌ ఫీల్‌ ఉంది అని నాని చెప్పుకొచ్చారు.

రియల్ లొకేషన్ఉ

రియల్ లొకేషన్ఉ


ఇంత వరకు రాయలసీమ అంటే వేరే రకం ఇమేజ్‌తో చేశారు. సెట్స్‌లో కాకుండా అక్కడి లొకేషన్లు, అక్కడి ఇళ్లలో చేసిన సినిమా లేదు. కథ ఎక్కడి ప్రాంతంలో జరుగుతుందో, అక్కడే చిత్రీకరించిన సినిమా ఇది. ప్రేక్షకులు ఇప్పటిదాకా సినిమాల్లో చూడని రియలిస్టిక్‌ లొకేషన్లు కనిపిస్తాయి.

దర్శకుడి గురించి..

దర్శకుడి గురించి..


దర్శకుడు హను మొదటి సినిమా ‘అందాల రాక్షసి'ని నాతో చేయాలనుకున్నాడు. అది నాకు సరిపోయే కథ కాదు కాబట్టి నచ్చలేదు. అది మరీ సీరియస్‌ అండ్‌ హెవీ అనిపించింది. తర్వాత మరో రెండు కథలు చెప్పినా నచ్చలేదు. అతను ఏ కథ చేసినా నన్ను దృష్టిలో పెట్టుకొని చేస్తాడని తెలుసు. అతను ఎంత మంచి టెక్నీషియనో తెలుసు. అతనికో సాలిడ్‌ సినిమా పడితే బాగుంటుందనుకునే టైమ్‌లో మా మధ్య జరిగిన డిస్కషన్ నుంచి పుట్టిన ఐడియా ఈ ‘కృష్ణగారి వీరప్రేమగాథ'.

కృష్ణగాడి ప్రేమ గురించి..

కృష్ణగాడి ప్రేమ గురించి..


సినిమాలో మహాలక్ష్మి అంటే కృష్ణగాడికి ప్రాణం. వాడిది పదిహేనేళ్ల ప్రేమ. కానీ తన ప్రేమను పక్కనున్న బెస్ట్‌ ఫ్రెండ్‌క్కూడా చెప్పుకోలేని పరిస్థితి. పొరపాటున బయటకు చెబితే ఎవరో ఒకరు వాణ్ణి వేసేస్తారు. అలాంటి ప్రమాదం మధ్యలోనే పదిహేనేళ్లు గడిపేస్తాడు...చివరకు తన ప్రేమను దక్కించుకోవడానికి తెగిస్తాడు అని నాని తెలిపారు.

మణిరత్నంతో సినిమా గురించి...

మణిరత్నంతో సినిమా గురించి...


ఇటీవల మణిరత్నంగారితో సినిమా ఓకే అయిందికానీ...అంతా రెడీ అనుకున్న సమయంలో వచ్చిన ఓ హిందీ సినిమాకూ, మేము అనుకున్న కథకు దగ్గర పోలికలున్నాయి. దాంతో ఆయన వేరే స్ర్కిప్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు. కచ్చితంగా నేను మణిసార్‌ డైరెక్షన్‌లో చేస్తాను. ఎప్పుడనేది తెలీదు అన్నారు నాని.

English summary
Actor Nani, Actress Mehreen, Director Hanu Raghavapudi, Producer Gopichand Achanta & Raju Sundaram at Krishna Gadi Veera Prema Katha Movie Working Stills.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu