»   » మా లిటిల్ రాస్కెల్ జున్నుగాడు.... కొడుకు గురించి నాని ట్వీట్!

మా లిటిల్ రాస్కెల్ జున్నుగాడు.... కొడుకు గురించి నాని ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nani Posts His Son's Photo In Social Media

టాలీవుడ్ స్టార్ హీరో నాని తన ముద్దుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియాలో తమ కుమారుడి ఫోటో పోస్టు చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నా చిట్టి రాస్కెల్‌ ఈ రోజుతో మొదటి వసంతంలో అడుగు పెడుతున్నాడు. వీడే నా దొంగనా కొడుకు. జున్ను గాడు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు.

2012లో నాని, అంజన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు 2017 మార్చి 29న బాబుకు జన్మనిచ్చారు. ఈ బుడ్డోడికి అర్జున్ అని పేరు పెట్టారు. అయితే ఇంట్లో ముద్దుగా జున్నుగాడు అని పిలుచుకుంటున్నారు.

ప్రస్తుతం నాని 'కృష్ణార్జున యుద్దం' అనే సినిమాతో నటిస్తున్నాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీంతో పాటు నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాత.

English summary
Actor Nani Son Arjun turns one day. "This little rascal turns one today. Donga naa koduku Junnu gaadu" Nani tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X