విజయ నిర్మల అంత్యక్రియలు: పార్థివదేహం నేరుగా విజయకృష్ణ గార్డెన్స్‌కు...
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం నానక్‌రాంగూడలోని నివాసంలో ఉంచారు. శుక్రవారం చిలుకూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
విజయ నిర్మల తనయుడు నరేష్ మాట్లాడుతూ... ''ఎన్నో పండుగలకు, వేడుకలకు నిలయం ఇది. ఈ ఇంట్లో తొలి విషాదం మా అందరికీ అమ్మ.. అమ్మలకు అమ్మ విజయ నిర్మలగారి మరణం. కొంతకాలంగా ఆరోగ్యం సరిలేక ఇబ్బంది పడుతున్నప్పటికీ అమ్మ బాగానే ఉంది. సడెన్‌గా బుధవారం అర్ధరాత్రి తర్వాత స్ట్రోక్ రావడంతో మమ్మల్ని అనాధలను చేసి వెళ్లిపోయింది. '' అన్నారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇక్కడి నుంచి నేరుగా పూల రథం చిలుకూరులో ఉన్న విజయ్ కృష్ణ గార్డెన్స్ బయల్దేరుతుంది. బంధుమిత్రులు, ఫ్యాన్స్ అంతా కలిసి ఇక్కడి నుంచే వెళతారు. ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లడం లేదు. డైరెక్టుగా ఇక్కడి నుంచి చిలుకూరులో ఉన్న విజయకృష్ణ గార్డెన్స్‌కు పూలరథంలో అమ్మను తీసుకెళతాం. 11 గంటలకు దహన సంస్కారాలు మొదలవుతాయని నరేష్ తెలిపారు.
విజయ నిర్మల వయసు 73 సంవత్సరాలు. 7వ ఏటనే బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె హీరోయిన్‌గా చాలా చిత్రాల్లో నటించారు. దర్శకత్వంలోనూ తన ప్రతిభ చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచారు.


Click it and Unblock the Notifications











