ఆమెకు, ఆ అప్పులతో సంబంధం లేదు.. నటుడు వీకే నరేష్ క్లారిటీ? ఎవరీ రమ్య రఘుపతి?

కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను ట్రాప్ చేసి వారి నుంచి భారీగా డబ్బు అప్పుగా తీసుకుని ముప్పతిప్పలు పెట్టిన శిల్పా చౌదరి ఉదంతం మరిచిపోకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. సీనియర్‌ నటుడు నరేశ్‌ మాజీ భార్య రమ్య రఘుపతి చీటింగ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న ఆయన మరో వీడియో కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

 పదుల సంఖ్యలో

పదుల సంఖ్యలో

రమ్య రఘుపతి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో ఎన్నో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. నరేశ్‌ పేరు చెప్పి ఎంతో మంది మధ్య తరగతి వారిని రమ్య నిండా ముంచారని తెలుస్తోంది. తొలుత ఐదుగురు పోలీసుఅలకు ఫిర్యాదు చేయగా పదుల సంఖ్యలో బాధితులు ఇప్పుడు బయటకి వస్తున్నారు.

భార్యనని చెబుతూ

భార్యనని చెబుతూ

కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు.. ఏకంగా బెంగళూరు వరకు ఈ చీటింగ్ సాగిందని తెలుస్తోంది. నరేశ్ ఆస్తులను చూపిస్తూ తాను ఆయన భార్యనని చెబుతూ కేవలం మిడిల్‌ క్లాస్ జనాల దగ్గర లక్షలలో మొత్తంలో అప్పులు తీసుకుంది. తిరిగి చెల్లించమని అడిగితే ముఖం చాటేస్తున్న క్రమంలో పోలీసులను ఆశ్రయించారు కొందరు.

 ఎటువంటి సంబంధం లేదు

ఎటువంటి సంబంధం లేదు


నరేష్ ఆస్తులు చూపించి ఆమె అప్పులు చేసినట్టు వార్తలు రావడంతో అందరూ ఆయనకు ఫోనులు చేయడం మొదలుపెట్టారట. ఈ నేపథ్యంలో రమ్య రఘుపతికి, తనకు సంబంధం లేదని నరేష్ స్పష్టం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. "రమ్య రఘుపతి ఆర్థిక సమస్యల విషయం బయటకు రావడంతో నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. ఈ విధంగా జరిగిందని నాకు నిన్న, మొన్నటి వరకు తెలియదు'' అని అన్నారు.

విడిపోయాం.

విడిపోయాం.


మాకు పెళ్ళై తొమ్మిదేళ్లు అవుతోంది. రెండు మూడేళ్ళ తర్వాత... అంటే దాదాపు ఐదేళ్ల క్రితం విడిపోయాం. ఇటువంటి సమస్యలు ఉన్నాయని తెలిసి, మరీ సమస్య పెరుగుతుందేమో అనే భయంతో విడిపోయాము. ఎవరికి వారు మా జీవితాలు గౌరవంగా గడుపుతున్నాం. మేం వేర్వేరుగా ఉన్నాం అని అన్నారు. మాకు సంబంధం లేదు. మూడు నెలల క్రితమే రమ్య రఘుపతికి, నాకు ఎటువంటి సంబంధం లేదని పబ్లిక్ నోటీసు కూడా పేపర్ లో ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.

Recommended Video

Dasara Movie Launch | Nani Keerthy Suresh Blockbuster Combo Is Back Again | Filmibeat Telugu
మాజీ మంత్రి సోదరుడి కుమార్తె

మాజీ మంత్రి సోదరుడి కుమార్తె


అది ప్రజలకు తెలియాలని ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఇక రెండు మూడు రోజులుగా నాకు విపరీతంగా ఫోనులు వస్తున్నాయి. ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇస్తే... ఫోన్ వచ్చింది. నాకు వీలైనంత సహాయం చేస్తానని పోలీసులకు చెప్పానని నరేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో మా కుటుంబానికి సంబంధం లేదు, మాకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు కాబట్టి... ఈ విషయంలో ఇంతకు మించి చెప్పలేను" అని నరేష్ వీడియో విడుదల చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన రమ్య రఘుపతి మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె. గతంలో విజయ నిర్మాల వద్ద కొ డైరెక్టర్ గా చేసిన ఆమె నరేష్ ను వివాహమాడింది. ఆయన నుంచి వేరు పడినప్పటికీ... నరేష్ పేరు చెప్పి ఆమె అప్పులు చేసినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X