చెప్పుతో కొట్టబోయిన రమ్య.. తెరమీదకు కొత్త పేరు తెచ్చి నరేష్ ఆరోపణలు

హాట్ టాపిక్ గా మారిన నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఒక సినిమా షూటింగ్ నిమిత్తం మైసూరులో ఒక హోటల్ లో బస చేసిన నరేష్, పవిత్ర లోకేష్ మీద నరేష్ భార్య రమ్య రఘుపతి దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత నరేష్ పలు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే మరో కొత్త పేరు తెరమీదకి తీసుకొచ్చారు నరేష్. ఆ వివరాల్లోకి వెళితే

వేరువేరుగా వీడియోలు

వేరువేరుగా వీడియోలు

నరేష్- పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారని, సహజీవనం చేస్తున్నారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం మీద వారు నేరుగా స్పందించడం లేదు కానీ కొంత నిజం కొంత నిజం కాదు అనే విధంగా పరోక్షంగా స్పందిస్తున్నారు.

ఇద్దరూ కూడా వేరువేరుగా వీడియోలు విడుదల చేసి రమ్య కావాలనే ఇదంతా చేస్తుందని ఆరోపణలు గుర్తించారు కానీ నిజంగా తాము సహజీవనం చేస్తున్నామా లేక మంచి స్నేహితులమా అనే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.

ప్రాణహాని

సినిమా షూటింగ్ నిమిత్తం పవిత్ర లోకేష్ స్వస్థలం అయిన మైసూరు వెళ్లిన నరేష్, పవిత్రలోకేష్ ఇద్దరు కూడా ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారనే విషయం రమ్యకు తెలియడంతో ఆమె ఒక లోకల్ ఛానల్ మీడియా ప్రతినిధులను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. నరేష్, పవిత్ర లోకేష్ బస చేసిన హోటల్ రూమ్ బయట ఆమె చాలా సేపు తలుపు బాదుతూ ఉండడంతో విషయం అర్థం చేసుకున్న నరేష్ వెంటనే పోలీసులను పిలిపించారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో పోలీసులు రమ్య రఘుపతిని నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరినీ కూడా అక్కడి నుంచి సేఫ్గా బయటకు తీసుకువచ్చారు.

ప్రేమలో ఉన్నారని

ప్రేమలో ఉన్నారని


ఆ సమయంలోనే నరేష్ పవిత్ర లోకేష్ మీద పడేవిధంగా రమ్య రఘుపతి చెప్పు కూడా విసిరినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. కానీ ఆ తరువాత నరేష్ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మళ్ళీ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇలా తమ మీదకు రావడం అనేది దాడి చేయడం కోసమేనని పేర్కొన్న ఆయన తన భార్య రమ్యకు రాకేష్ రెడ్డి అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆరోపించారు.

ఈలలు వేస్తూ

కొద్దిరోజుల క్రితమే భార్యకు ఒక ముస్లిం కార్ డ్రైవర్ తో సంబంధం ఉందని ఆరోపణలు చేయగా ఇప్పుడు కొత్తగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి పేరు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయితే నరేష్ వెళ్ళిపోతూ కూడా రమ్య రఘుపతిని రెచ్చగొట్టే విధంగా ఈలలు వేస్తూ నువ్వేం చేయలేవు అనే విధంగా ప్రవర్తించడం వీడియోలలో రికార్డు అయింది.

డబ్బు కోసమే ఇదంతా


ప్రస్తుతం ఈ అంశం మీద పెద్ద ఎత్తున హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. ఇక విడాకులు ఇవ్వాలని నరేష్ గన్ తో బెదిరించారని కూడా రమ్య రఘుపతి ఆరోపణలు చేశారు. అయితే ఆమె డబ్బు కోసమే ఇదంతా చేస్తుందన్నట్టు నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ కూడా వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X