కృష్ణ మరణించిన తర్వాత అలాంటి పరిస్థితి? నరేష్ రెండో భార్య ఆరోపణలపై కొడుకు రియాక్షన్
నరేష్ కొడుకు నవీన్ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. నందిని నర్సింగ్ హోం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన... రెండు మూడు సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మహేశ్ బాబుతో బాండింగ్, రమ్య రఘుపతి విడుదల చేసిన ఆ వీడియోలో వాస్తవాలు ఏంటి అనే విషయాలు చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ తన సహనటి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒక హోటల్ లో పవిత్ర-నరేష్ కలిసి ఉండగా... నరేష్ మూడో భార్య మీడియాతో సహా వచ్చి గొడవ చేయడంతో.. వీరిద్దరి రిలేషన్ అప్పటిలో సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయింది. ఇక ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవడ.. మరింత హాట్ టాపిక్ అయింది. అయితే నరేష్ కొడుకు నవీన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

అయితే నవీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన ఫ్యామిలీ సంగతులు చెప్పుకొచ్చారు. ఆయన మహేశ్ బాబుతో బాండింగ్, కృష్ణ, విజయ్ నిర్మలతో ఎలా ఉండే వారో చెప్పుకొచ్చారు. అంతే కాదు.. కృష్ణ చనిపోయినప్పుడు రమ్య రఘుపతి ఓ వీడియో విడుదల చేసింది. ఆ ఆరోపణలపై నవీన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఆ ఇంటర్వ్వలో విజయ్ నిర్మల జ్ఞాపకాలను మరిచిపోలేక కృష్ణగారు మరణించారా అని యాంకర్ అడగ్గా... నవీన్ మాట్లాడుతూ.... అవును నిజమే. ఆయన విజయ్ నిర్మలమ్మను బాగా ప్రేమించారు. నేనే ఆమెను మర్చిపోవడానికి దాదాపు వన్ ఇయర్ ఇబ్బంది పడ్డాను. వాళ్లు ఎప్పుడూ కలిసి ఉండే వారు. అలాంటిది ఆమెను దూరం చేసుకున్నాకా ఆయన చాలా బాధ పడ్డారు. నా సినిమా ఓకే అవుతుంది అయ్యాక చెబుదాం అనుకున్నా... ఈ లోపే చనిపోయారని చెప్పుకొచ్చారు.

మహేశ్ బాబు గారు.. బాగా ట్రై చేశారట.. కృష్ణగారిని తన ఇంటికి తీసుకెళ్లడానకిి.. అవునా అని యాంకర్ అడగ్గా... అంటే.. దానికి నవీన్ అవునండి. కానీ ఆ ఇంటితో అనుబంధం వదల్లేక వెళ్లలేదు. ఎవరికైనా ఉంటుంది.. దాదాపు 40 ఏళ్లు ఆ ఇంట్లో ఉండి.. సడెన్ గా వదిలేసి రావాలంటే.. కష్టం. ఆయన కూడా అందుకే రాలేదు. మా ఫ్యామిలీ అందరికీ అటాచ్ మెంట్స్ ఎక్కువ. విజయ్ నిర్మల గారు పోయాక కూడా అందరం మీట్ అయ్యే వాళ్లం. కృష్ణ గారు కూడా పోయాకా... మహేశ్ బాబు ఇప్పటికీ మాట్లాడుకుంటాం. రెండు మూడు రోజులకోసారి ఫోన్ లో మాట్లాడుకుంటామన్నారు. మహేష్ అన్నతో మంచి బాండింగ్ ఉందన్నారు.

కృష్ణగారు చనిపోయాక రమ్య రఘుపతి ఓ వీడియో విడుదల చేస్తూ.. ఆరోపణలు చేసింది. కృష్ణగారి శవాన్ని అనాధ శవంలా వదిలేశారని ఆరోపణలు చేసింది. ఇది కరెక్టే అంటారా అని యాంకర్ అడిగారు. దీనికి నవీన్... అది తప్పండి.. అలా ఎందుకు చేస్తారు.. ఇది రాంగ్ అండి. కేర్ టెకర్స్ ఉన్నారు. మేం అంతా ఉన్నాం. అందులో వాస్తవం లేదు. ఇక రమ్య రఘుపతి, నరేష్ గారి మధ్య వారి పర్సనల్స్. నేను ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. నేను మాత్రం ఆమెతో బాగానే మాట్లాడే వాడిని... అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











