‘మా’లో మళ్లీ ఎన్నికల రచ్చ మొదలైంది: జీవిత రాజశేఖర్‌తో రంగంలోకి నరేష్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు వస్తున్నాయంటే తెలుగు సినిమా పరిశ్రమలో వాతావరణం వేడెక్కుతుంది. అందుకు కారణం ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో రెండు గ్రూఫులు ఉండటమే. గతంలో ఈ గ్రూఫులు రాజేంద్రప్రసాద్, జయసుధను బరిలో దింపగా... రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఆ సమయంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, పత్యారోపణలు చేసుకుంటూ మీడియాకెక్కడంతో 'మా' పరువు పోయింది. అయితే ఆ తర్వాత టర్మ్ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఎన్నికలు లేకుండానే శివాజీ రాజాను అధ్యక్షుడిగా, మరో గ్రూఫుకు చెందిన నరేష్‌ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అయితే శివాజీరాజా అధ్యక్షుడైన తర్వాత... నరేష్ వర్గం చాలా విషయాల్లో అసంతృప్తిగా ఉంది. ఆ మధ్య నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ నరేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ తర్వాత రెండు గ్రూఫుల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సారి 'మా' అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా కాకుండా... ఎన్నికలు నిర్వహించాలని నరేష్ వర్గం డిసైడ్ అయింది. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నరేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను అధ్యుడిగా, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఎన్నికలు కోరుకోం కానీ...

ఎన్నికలు కోరుకోం కానీ...

‘మా'లో సాధారణంగా ఎన్నికలు కోరుకోం. అందరం ఒకటే కుటుంబం. గతంలో ఒకటి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచనలు వేరైనపుడు, మెంబర్స్ అభిప్రాయం బట్టి ఎన్నికల ద్వారా ఎవరు అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయించబడుతుంది. ఒక టర్మ్ ఒకరు మాత్రమే చేయాలని అందరి నిర్ణయం మేరకు గత టర్మ్ రాజేంద్రప్రసాద్ తన పదవికాలం అయిపోగానే తప్పుకున్నారు. శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. మళ్లీ ఒకసారి శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉంటానంటున్నాడు. అందుకే మేము ఎన్నికలు పెట్టాలని కోరుతున్నాం... అని నరేష్ తెలిపారు.

అందుకే నేను పోటీ చేస్తున్నాను

అందుకే నేను పోటీ చేస్తున్నాను

వందల మంది మెంబర్స్ నాకు ఫోన్ చేసి ఒక్క టర్మ్ నన్ను చేయాలంటున్నారు. మీ కుటుంబం లక్షల రూపాయలు డొనేట్ చేయడమే కాకుండా ఎప్పుడూ మాకు అండగా ఉంది. మిమ్మల్ని ఒక్కసారి ‘మా' అధ్యక్షుడిగా చూడాలని కోరుతున్నారు. నేనెప్పుడూ పదవుల కోసం పాకులాడేలేదు. పని కోసం పాకులాడతాను. ఈ టర్మ్ లో అందరి నిర్ణయం మేరకు సరే అని అంగీకరించాను. పెద్దల అందరి అశీర్వాదం ఉంది. అందరూ వెంట ఉన్నామంటున్నారు. ఇప్పటికీ కూడా యూనానిమస్ అనేది మేము కోరుకుంటున్నాం. వారు కూడా పోటీ చేస్తామంటున్నారు కాబట్టి ఎన్నికలు తప్పడం లేదని నరేష్ తెలిపారు.

వివాదాల జోలికి పోవాలనుకోవడం లేదు

వివాదాల జోలికి పోవాలనుకోవడం లేదు

ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మాకు ఎలాంటి యుద్దాలు, గొడవలు, కాంట్రవర్సీలకు అవసరం లేదు. నా కోరిక మేరకు జీవిత రాజశేకర్ పోటీ చేయడానికి ఒప్పుకున్నారు.

మాకే బలం ఎక్కువగా ఉంది

మాకే బలం ఎక్కువగా ఉంది

‘మా' మెంబర్స్ చాలా మంది మద్దతు మాకు ఉంది. ఒక అద్భుతమైన మేనిఫెస్టోతో మా ప్యానెల్ ముందుకు వస్తోంది. మా ప్యానెల్ లోకి అలీ, శివ బాలాజీ ఇలా చాలా మంది ప్రముఖులు వచ్చారు. త్వరలో అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తాం. ఎన్నికల తేదీ మార్చి 10.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి అని నరేష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X