స్క్రిప్టు నచ్చింది అందుకే పైసా కూడా తీసుకోవటం లేదు
విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ చిత్రం రామ్ తాజాగా హిందీలోకి బోలో రామ్ పేరట రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, ఓం పురి, పద్మని కొల్హాపురి వంటి వారు కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ స్క్రిప్టు చదివిన నసీరుద్దీన్ షా ఈ చిత్రంలో చేయటానికి పైసా కూడా తీసుకోనని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...బొలో రామ్ వంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. ఇవి రేర్ జెమ్స్. వీటిలో నటించటం నటుడుకి ఎంతో అదృష్టం అని నేను నమ్ముతాను. అందుకే నేను ఉచితంగా చేయటానికి ముందుకొస్తున్నాను. ఎందుకంటే నేను డబ్బు తీసుకుంటే ఆ పాత్రకు న్యాయం చేయలేను...అన్నారు. ఈ చిత్రాన్ని తమిళ ఒరిజనల్ లో అమీర్ అనే దర్శకుడు డైరక్ట్ చేసాడు. హిందీలో రాకేష్ చతుర్వేది అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. గోల్డీ భుతానీ అనే నిర్మాత తన కుమారుడు రిషీ బుతానినీ లాంచ్ చేయటానికి ఈ సినిమాను ఎన్నుకున్నారు.


Click it and Unblock the Notifications











