బ్రేకింగ్.. మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నవదీప్... పరారీలో ఉన్నాడని అపోహలు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం రేపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసులో ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరోసారి ఈ కేసులో హీరో నవదీప్ ఇరుక్కున్నాడు. ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రమేయం ఉన్న ఈ కేసులో... తాజాగా నవదీప్ అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి... ఈ కేసు వివరాలు వివరించారు. ఆ వివరాల్లోకి వెళితే...
గత కొంత కాలంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కేసులో హీరో నవదీప్ ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా.. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతని నార్కోటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుడి మల్కాపురం పోలీసులతో కలసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు.... ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

నైజీరియన్ల సహాయంతో నిర్మాత సుశాంత్ రెడ్డి డ్రగ్స్ దందా సాగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇక ఈ డ్రగ్స్ కేసుపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి.. నిందితుల గురించి వెల్లడించారు. టాలీవుడ్లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లు బయటకు వస్తున్నారని చెప్పిన సీపీ... తాజాగా మదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో ఐదుగురిని అరెస్టు చేసి వారివద్ద ఉన్న సెలఫోన్లు సీజ్ చేశామని చెప్పుకు వచ్చారు.
సీపీ మాట్లాడుతూ... ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుండి వచ్చింది. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేష్ రావును అదుపులోకి తీసుకున్నాము. నటుడు నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించాము. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే వారిని పట్టుకుంటామంటూ చెప్పుకువచ్చారు.
ఇక ఇటీవలే విడుదల అయిన బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయన్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో తాము రైడ్ చేసినప్పుడు ఉన్న సన్నివేషాలు బేబీ సినిమాలో ఉన్నాయి. సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం హెచ్చరికలు లేకుండా సినిమాలో చూపించడం నేరమని తెలిపారు.

బేబీ సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారుల ఉపమోగించాలని దృశ్యాలను చూపించారు. ఇలాంటి వాటిని దృశ్యాలను చేయవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. బేబీ సినిమా వాళ్ళకు నోటీసులు ఇస్తాము. ఇప్పటి నుంచి ప్రతి సినిమా పై పోలీసుల నిఘా ఉంటుంది. బెంగుళూరులో 18 మంది నైజీరియాలు ఉన్నారని గుర్తించామమని తెలిపారు.


Click it and Unblock the Notifications











