ఆదివారం జియాని కలిసి మాట్లాడా: నవదీప్

By Srikanya

హైదరాబాద్ : మొన్న శనివారం హైదరాబాద్ లో జియాఖాన్ ని కలిసి మాట్లాడాను. మేము ఓ కేఫ్ లో కలుసుకున్నాం. ఆ తర్వాత ఆమె ముంబైకి వెళ్లిపోయింది. ఆమె హైదరాబాద్ కి ఓ తెలుగు సినిమా గురించి మాట్లాడటానికి వచ్చింది. ఆమె చాలా తెలివైన అమ్మాయి. 2012 ల లో జరిగిన ఇండియన్ ఫ్యాషన్ స్ట్రీట్ ర్యాప్ షో లో మొదటి సారి మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటినుంచి టచ్ లోనే ఉంటున్నాం. ఆదివారం ఆమెతో మాట్లాడాక ఆమె తనకు వస్తున్న ఆఫర్స్ గురించి చాలా నిరుత్సాహంగా ఉందని అర్దమైంది అంటూ చెప్పుకొచ్చారు నవదీప్.

సినీజగత్తులో తనకంటూ స్థానం సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో నిరాశ నిస్పృహలకు గురికావటంతో పాటు స్నేహితునితో విభేదాలూ బాలీవుడ్‌ యువనటి జియాఖాన్‌(25) ఆత్మహత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన 'నిశ్శబ్ద్‌' (2007)సినిమాతో తెరంగేట్రం చేసిన జియాఖాన్‌.. తొలి చిత్రంలోనే ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సరసన నటించే అవకాశాన్ని పొందారు.

వివాదాస్పదమైన ప్రేమ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఆ తర్వాత హిందీ 'గజిని'(2008)లో అమీర్‌ఖాన్‌తో, హౌస్‌ఫుల్‌(2010) సినిమాలో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించారు. అయితే, ఈ సినిమాలేవీ జియాఖాన్‌కు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు లభించలేదు.

ఈనెల 2న ఫొటోషూట్‌ కోసం జియాఖాన్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఆ కార్యక్రమం వాయిదాపడటంతో 3న ముంబయికి తిరిగి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితుడు సూరజ్‌ పంచోలీతోనూ జియాకు విభేదాలు తలెత్తినట్లు సమాచారం. సూరజ్‌ మరో యువతితో ప్రేమలో పడ్డారనే విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ముంబయిలోని ప్రసిద్ధ ప్రాంతం జుహూలోని సాగర్‌ సంగీత్‌ భవనంలో ఉన్న తన ఫ్లాటులో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జియాఖాన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. తల్లి రుబియా అమీన్‌, జియా సోదరితో కలిసి బయటకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి జియా దుపట్టాకు వేలాడుతూ కనిపించింది.

శవపరీక్ష నిర్వహించిన జేజే ఆస్పత్రి వైద్యులు...ఉరివేసుకోవటం వల్లే ఆమె మృతి చెందారని నిర్ధరించారు. అమితాబ్‌ బచ్చన్‌, రామ్‌గోపాల్‌ వర్మ తదితరులు జియా ఆత్మహత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X