క్రికెటర్ రవిశాస్త్రిని ఆడేసుకొన్న నవీన్ పోలిశెట్టి.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. వీడియో వైరల్

బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన యువ హీరో నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత జాతిరత్నాలు చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయారు. జాతి రత్నాలు అందించిన సక్సెస్‌తో కెరీర్ గట్టిగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను తన భుజాన వేసుకొని ప్రమోషన్స్‌ను భారీగా చేస్తున్నాడు. విభిన్నమైన ప్రమోషన్స్‌తో నవీన్ పొలిశెట్టి ఆకట్టుకోవడమే కాకుండా సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా ఐపీఎల్ టోర్నిలో కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. ఐపీఎల్ కోసం స్టార్స్ స్పోర్ట్స్ బాక్స్‌లో నవీన్ శెట్టి చేసిన హంగామా విషయంలోకి వెళితే..

Naveen Polishetty

గత నెల రోజులకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రంజుగా సాగుతున్నది. ఈ పోటీలు తుది దశకు చేరుకొన్నాయి. క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి ఐపీఎల్‌లో నవీన్ పొలిశెట్టి సందడి చేస్తున్నారు. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే సోమవారం సాయంత్రం గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.

Naveen Polishetty

అయితే గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేపట్టి 214 పరుగులు చేసింది. 2015 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దాంతో కామెంటరీ బాక్స్‌లో సినీ నటుడు నందు, క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, కామెంటేటర్ వెంకటేష్‌తో కలిసి నవీన్ పొలిశెట్టి ఫన్ క్రియేట్ చేశారు.

Naveen Polishetty

కామెంటరీ బాక్స్‌లో ఎవరినైనా ఇమిటేట్ చేయమని అడిగితే.. లెజెండరీ క్రికెటర్ రవిశాస్త్రీ కామెంటెరీ చేసే విధానాన్ని చూపించాడు. రవిశాస్త్రీ మాదిరిగా కామెంటరీ చెబుతూ నందు, ప్రసాద్, వెంకటేష్‌ను కడుపుబ్బ నవ్వించాడు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టిలో ఉండే మరో టాలెంట్ బయటపడింది.

Naveen Polishetty

నవీన్ పొలిశెట్టి అంతటితో ఆగకుండా గుజరాత్ స్టేట్‌పై తనదైన శైలిలో ఫన్ జనరేట్ చేశారు. గుజరాత్ స్టేడియంలో వర్షం భారీగా పడటంతో నీళ్లతో నిండిపోయింది. దాంతో గుజరాత్ డ్రై స్టేట్.. కాబట్టి గ్రౌండ్ తొందరగానే ఆరిపోతుంది. మీరేం ఇబ్బంది పడకండి అంటూ నవీన్ పొలిశెట్టి కామెంట్ చేశాడు.

నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం విడుదలకు సిద్దమైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్‌ బాబు పీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్నది. చాలా రోజుల తర్వాత మళ్లీ అనుష్క వెండితెరపై ప్రత్యక్షం అవుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X