హీరో నిఖిల్ వీరంగం, తమ్మడిని ర్యాగింగ్ చేయడమే కారణమా?
హైదరాబాద్ : 'స్వామిరారా' చిత్రంతో ఇటీవల హిట్ సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పేరు తాజాగా ఓ దాడి సంఘటనలో మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశం అయింది. నిఖిల్, ఆయన తమ్ముడు రోహిత్ కలిసి తమపై దాడి చేసారని, తమ జోలికి వస్తే అంతు చూస్తామని బెదిరించారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
నిఖిల్ తమ్ముడు రోహిత్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఈ రోజు పరీక్ష రాసేందుకు సెయింట్ పీటర్స్ కాలేజీకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తొలుత రోహిత్, అతని స్నేహితులు దాడికి దిగారని, ఆ తర్వాత నిఖిల్ సీన్లోకి ఎంటరయ్యాడని తెలుస్తోంది.
ఈ గొడవ కారణంగా పరీక్షలకు డిస్ట్రబెన్స్ అయినట్లు విద్యార్థులు చర్చించుకుంటున్నారు. అయితే రోహిత్ పరీక్ష రాస్తుండగా కొందరు విద్యార్థులు అతన్ని గేలి చేస్తూ అరిచారని......అందు వల్లనే ఈ గొడవ జరిగిందని మరికొందరు విద్యార్థులు అంటున్నారు. అయితే నిఖిల్ వాదన మరోలా ఉంది. తమ తమ్ముడి ర్యాగింగ్ చేస్తున్నారని, ఫిర్యాదు చేసేందుకు తాను వచ్చానని వెల్లడించారు.
ఈ గొడవపై కాలేజీ యాజమాన్యం విచారణ జరుపుతోంది. విషయం పోలీసులకు తెలియడంతో వారు కూడా రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మల్లారెడ్డి కాలేజీలోని రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ ఈ గొడవకు ప్రధాన కారణంగా స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











