Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్‌తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పెళ్లి కొడుకైన హీరో నిఖిల్.. సినీ ప్రముఖులంతా దూరం.. కారణమేమిటింటే (Exclusive Pics)
టాలీవుడ్ హీరో నిఖిల్ పెళ్లికొడుకయ్యారు. పెళ్లికి ముందు సంప్రదాయ పద్దతుల్లో జరుగాల్సిన కార్యక్రమాలను బుధవారం సాయంత్ర నుంచి రాత్రి వరకు కొనసాగాయి. పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను నిఖిల్ మీడియాకు రిలీజ్ చేశారు. స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. పెళ్లి కార్యక్రమంలో నిఖిల్ మంచి జోష్‌గా కనిపించారు. ఆయనకు సంబంధించిన ఫోటోలు ఇవే.
Recommended Video
కరోనా వల్ల వాయిదా
డాక్టర్ పల్లవి వర్మతో ఇరు కుటుంబాల అంగీకారం తెలుపడంతో ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా పెళ్లి నిశ్చితార్థం జిరిగింది. ఏప్రిల్ 16న జరుగాల్సిన పెళ్లికి ముహుర్తాలు పెట్టారు. అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న సమయంలో కరోనావైరస్ ప్రమాదం ముంచుకు రావడంతో పెళ్లి వాయిదా పడింది.
మే 14 వాయిదా
ఆ తర్వాత నిఖిల్ పెళ్లిని మే 14కు వాయిదా వేశారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించడంతో నిఖిల్ ప్రస్టేషన్కు గురయ్యారు. లాక్డౌన్ ఎతివేత తర్వాత పెళ్లిని అభిమానుల మధ్య ఘనంగా చేసుకోవాలని అనుకొన్నారు. అయితే ఇక లాక్డౌన్ ఇప్పట్లో ఎత్తివేసే పరిస్థితులు కనిపించకపోవడంతో హడావిడిగా మే 14నే అతికొద్ది మంది సమక్షంలోనే పెళ్లిని జరిపించారు.
మూడాల రీత్యా హడావిడిగా పెళ్లి
లాక్డౌన్ తర్వాత మూఢాలు రావటం.. ముహుర్తాలు లేకపోవటం వలన వధూవరుల ఇద్దరి జాతకాల రీత్యా గురువారం మే 17 తేదీ ఉదయం 6:31 గంటలకు పెళ్ళి చేయటానికి ఇరు పెద్దలు నిర్ణయించారు. అయితే సోషల్ డిస్టెన్స్ దృష్ట్యా తమ కుటుంబాలకు అతి దగ్గరగా ఉండే వారినే ఈ పెళ్లికి ఆహ్వానించారు. షామిర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెళ్ళి చేయడానికి నిశ్చయించారు. ఈ పెళ్ళిలో ప్రభుత్వం సూచించే అన్ని పద్దతులు పాటిస్తున్నారు.
అభిమానులకు సోషల్ మీడియా ద్వారా
అభిమానుల మధ్యలో తన వివాహానాన్ని ఘనంగా చేసుకోవాలని భావించిన నిఖిల్ ఇప్పిడున్న కొవిడ్-19 పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఇలా నిరాడంబరంగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంభందించిన ఫోటోస్, వీడియోస్ మాత్రం ఫ్యాన్స్‌కి సోషల్ మీడియా ద్వారా అందించనున్నారు. ఈ నూతనవధువరులను ఎక్కడి వారు అక్కడే వుండి ఆశీర్వదించాలని కొరుకుంటున్నాము.
తల్లితో నిఖిల్ సిద్ధార్థ
పెళ్లి కార్యక్రమాల్లో తల్లితో నిఖిల్ సిద్ధార్థ.. ఆనందంగా కుటుంబ సభ్యులతో యువ హీరో
భక్తి శ్రద్దలతో నిఖిల్
పెళ్లికి ముందు సంప్రదాయంగా నిర్వహించే పూజలో భక్తి శ్రద్దలతో నిఖిల్
ఉట్టిపడుతున్న పెళ్లి కళ
అందంగా ముస్తాబు కావడంతో డాక్టర్ పల్లవి వర్మలో ఉట్టిపడుతున్న పెళ్లి కళ
మంచి పెళ్లి జోష్‌లో నిఖిల్
పెళ్లి కార్యక్రమాల్లో తల్లితో కలిసి నిఖిల్.. మంచి పెళ్లి జోష్లోకనిపిస్తున్న నిఖిల్
పెళ్లికూతురైన ఆనందంలో
పెళ్లికూతురైన ఆనందంలో చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజిచ్చిన వధువు డాక్టర్ పల్లవి వర్మ
ప్రేమతో నమస్కరిస్తున్న నిఖిల్
పెళ్లికి హాజరైన అతిథులకు ప్రేమతో నమస్కరిస్తున్న నిఖిల్
మంగళ స్నానం చేస్తున్న హీరో నిఖిల్
పెళ్లి కొడుకుగా మారే ముందు సంప్రదాయ పద్దతుల్లో మంగళ స్నానం చేస్తున్న హీరో నిఖిల్