హీరో నిఖిల్ ను పట్టుకున్న పోలీసులు
హ్యాపీడేస్, యువత, కలావర్ కింగ్, వీడు తేడా చిత్రాల్లో హీరోగా నటించిన నిఖిల్ ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. అతిగా మధ్యం సేవించి కారు నడుపుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ సీజ్ చేశారని, శనివారం మధ్యాహ్నం వరకు నిఖిల్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతనికి భారీ జరిమానా విధించడం లేదా కోర్టులో హాజరు పరిచే అవాకాశాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను నిఖిల్ ఖండించారు. కారు తనదే కానీ, కారులో నేను లేనని నిఖిల్ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే నిఖిల్ ను బ్రీత్ అనలైజర్ తో పోలీసులు పరీక్షిస్తున్న చిత్రాన్ని ఓ ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం. నిఖిల్ కారు నెంబర్ ఎపి9 bz 0089.
ఈ మధ్య తరచూ సినిమా హీరోలు ఏదో తప్పు చేసి పోలీసులకు దొరికి పోతున్న సంగతి తెలిసిందే. హీరో రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడగా, నవదీప్ ఇటీవల రెండు సందర్భాల్లో పోలీసులకు బుక్కయ్యాడు. వీరు ఇలా తయారవడానికి కారణం...సినిమాల ద్వారా వచ్చే అడ్డు అదుపు లేని డబ్బుతో విలాసాలకు అలవాటు పడటమే కారణమని స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











