»   » కిరాక్ వేశంకోసం కష్టపడుతున్నాడు: యూకే వెళ్ళిమరీ కండలు పెంచాడు

కిరాక్ వేశంకోసం కష్టపడుతున్నాడు: యూకే వెళ్ళిమరీ కండలు పెంచాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేశవ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్, ఎట్టకేలకు తన కొత్త సినిమా ప్రకటించాడు. ఈసారి ఓ రీమేక్ ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోతున్నాడు. కన్నడలో హిట్ అయిన కిరాక్ పార్టీ రీమేక్ లో నిఖిల్ నటించబోతున్నాడు. ఆ వివరాలు అఫీషియల్ గా బయటకొచ్చాయి.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఆ మూవీ. ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కన్నడలో హిట్ కొట్టిన 'కిర్రాక్ పార్టీ' సినిమాకి తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలోని పాత్రకి తగిన విధంగా కనిపించడం కోసం ఆయన పది కిలోల బరువు పెరిగాడట.

 Actor Nikhil Will be Next Seen in Kirik Party Telugu Remake

ఇందుకోసం యుకె వెళ్లి ఇరవై రోజులు వుండి, స్పెషల్ గా జిమ్ ట్రయిన్ అయివచ్చాడు. దీంతో మాంచి కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు నిఖిల్. ఇంకా కొన్ని కిలోలు పుటప్ చేసి, బాడీ ఫుల్ షేప్ కు వచ్చాక, అప్పుడు ఫోటో షూట్ చేసి, జనాల ముందుకు రావాలని అనుకుంటున్నాడట నిఖిల్.

ఇప్పటికే నిఖిల్ ను బయట చూసిన వారు, ప్రొఫైల్ పిక్స్ చూసిన వారు, వావ్ అంటున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా బ్లాక్ బస్టర్ నిఖిల్ చేసిన కేశవ ఏవరేజ్ అనిపించుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని కిర్రాక్ పార్టీ అనువాదంపై గట్టిగా దృష్టి పెట్టాడు.

ఇంకా ఆ కసరత్తును కొనసాగిస్తూనే వున్నాడు. ఈ సినిమాలో కొత్త లుక్ తో ఆయన కనిపించనున్నాడన్న మాట. ఇక ఆ తరువాత తమిళ మూవీ 'కణిదన్' రీమేక్ లోను నటించనున్నాడు. ఆ నెక్స్ట్ మూవీగా 'కార్తికేయ' సీక్వెల్ వుంటుందట. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు.

Akkineni Akhil sensational tweet on Actor Nani | Filmibeat Telugu
English summary
Actor Nikhil Gained the stardom and fame with Sekhar Kammula’s Happy Days. After watching this film, the filmmakers has decided to make the remake of Kirik Party Telugu Remake only with this young hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu