ఒకేసారి రెండు సినిమాలు.. మరో క్రేజీ దర్శకుడితో నితిన్!
Recommended Video

యంగ్ హీరో నితిన్ సినీ కెరీర్ ని గమనిస్తే ఒడిదుడుకుల్లో సైతం తట్టుకుని నిలబడిన సందర్భాలు కనిపిస్తాయి. ప్రస్తుతం నితిన్ కు మంచి క్రేజ్ ఉంది. నితిన్ చిత్రాల పట్ల చూపుతున్నారు. పదేళ్ల వరకు విజయానికి నోచుకోని నితిన్ ఇష్క్ చిత్రంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్నాడు. ఆ తరువాత గుండె జారి గల్లంతయ్యిందే, అ..ఆ వంటి విజయాలు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. నితిన్ త్వరలో వెంకీ కుడుముల దర్శత్వంలో నటిచబోతున్నాడు.

రష్మిక హీరోయిన్
వెంకీ కుడుముల, నితిన్ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రంగా రూపొందబోతోంది. డెబ్యూ మూవీ ఛలో చిత్రంతోనే వెంకీ దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్నాడు. దీనితో ప్రస్తుతం నితిన్ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది.

నవంబర్ నుంచి
నితిన్ ఈ ఏడాది శ్రీనివాస కళ్యాణం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నిరాశపరిచింది. తదుపరి చిత్రంలో ఆచితూచి అడుగులు వేయాలని భావించిన నితిన్ వెంకీ కుడుములకు ఒకే చెప్పాడు. నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భీష్మ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు.

మరో క్రేజీ దర్శకుడితో
తాజా సమాచారం ప్రకారం నితిన్ మరో క్రేజీ దర్శకుడిని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సాహసం, మనమంతా, ఐతే వంటి చిత్రాలతో వైవిధ్యభరితమైన దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శత్వంలో నితిన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ కోసం ఇంట్రెస్టింగ్ పాయింట్ తో చంద్రశేఖర్ ఏలేటి కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రెండు సినిమాలు ఒకేసారి
ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరగబోతున్నట్లు తెలుస్తోంది. వేగంగా ఈ రెండు చిత్రాలు ఫినిష్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో నితిన్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది. నితిన్, వెంకీ కుడుముల చిత్రం సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











