హీరో నితిన్‌కు సమన్లు, టాక్స్ ఎగ్గొట్టినందుకే..
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...గత రెండు సంవత్సరాల నుంచి నితిన్ సర్వీస్ టాక్స్ కట్టడం లేదని తెలుస్తోంది. గత రెండేళ్లుగా నితిన్ హిట్ సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నా టాక్స్ అసలు కట్టడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు అతనికి నోటీసులు జారీ చేసారు.
సర్వీస్ టాక్స్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం చాలా మంది యంగ్ హీరోలు, ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్న నటులు, రియాల్టీ షోలలో నటించే యాంకర్లు బాగానే సంపాదిస్తున్నా సర్వీస్ టాక్స్ మాత్రం చెల్లించడం లేదని తెలుస్తోంది. అందరిపైనా అధికారులు దృష్టి సారించారు.
వివిధ మార్గాల్లో వారి ఆదాయ వివరాలు, సంపాదన ఎంత ఉంది అనే వివరాలు సేకరిస్తున్నారు. హీరో నితిన్‌కు సమన్లు అందిన విషయం తెలుసుకున్న పలువురు స్టార్స్ ముందు జాగ్రత్తలో పడ్డారు. త్వరలోనే మరికొందరు యంగ్ హీరోలకు, నటులకు, నటీమణులకు సమన్లు పంపనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












