అత్తారింటికి దారేది పైరసీ: ఉచ్చ పడాలంటూ నితిన్ ట్వీట్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాం ఏరియాలో యంగ్ హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి గ్లోబల్ సినిమా సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన నేపథ్యంలో నితిన్ తీవ్రంగా స్పందించారు.
పైరసీకి ప్రధాన కారణం ఎడిటర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అని తెలిసి....నితిన్ షాక్‌కు గురయ్యాడు. ఎందకంటే నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే'కి కూడా అరుణ్ కుమార్ పని చేసాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రానికి కూడ అరుణ్ కుమార్ పని చేస్తున్నాడట.
'ఎడిటర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అత్తారింటికి దారేది చిత్రాన్ని బయటకు లీక్ చేసాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. ఇతడు 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి పని చేసాడు. ఇపుడు 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. ఎంతో షాకయ్యాను. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి ఆలోచన రావాలంటేనే ఉచ్చ పడిపోవాలి' అంటూ ట్వీట్ చేసాడు.
పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్ 'అత్తారింటికి దారేది' చిత్రం నైజాం రైట్స్ పోటీ పడి దక్కించుకన్నాడు. ఇందుకోసం భారీ మొత్తం వెచ్చించాడు. విడుదలకు ముందే సినిమా పైరసీకి గురైన నేపథ్యంలో నితిన్‌లో ఆందోళన నెలకొన్నట్లు ఆయన ట్వీట్ బట్టి తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












